7న శిక్షణ, ఉద్యోగావకాశాల కల్పనకు ఇంటర్వ్యూలు
అనకాపల్లి: నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణతో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు స్థాని క ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల7న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీఐపీఈటీ) డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. శేఖర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.సీఐపీఈటీ, ఎన్టీపీసీ సింహాద్రి ఆధ్వర్యంలో ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎంపికై న 30 మంది యువకులకు విజయ వాడలో ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలంలో నెలకు రూ.3వేల చొప్పున గౌరవవేతనం అందజేయనున్నట్టు తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం విశాఖ, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, మైసూర్ తదితర ప్రాంతా ల్లో ఉద్యోగావకాశాల కల్పించనున్నట్టు తెలిపా రు.మరిన్ని వివరాలకు 9398535697 అనే ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
వృత్తి కార్మికుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
మెప్మా పీడీ సరోజిని
యలమంచిలి రూరల్: పట్టణాల్లోని వృత్తి కా ర్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా వారిని గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) పీడీ ఎం.సరోజిని తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వ హించిన వివిధ వృత్తి కార్మికుల గుర్తింపు మేళాను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో పనిచేస్తున్న ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఏసీ,టీవీ,గీజర్, రిఫ్రిజిరేటర్,వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాలకు మరమ్మతులు చేసే వారిని గుర్తించి, మెరుగైన జీవనోపాధి కల్పించేందు కు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. తొలి దశలో వివిధ వృత్తి కార్మికులను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ద్వారా తర్ఫీదునిచ్చి జీవనోపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. మేళాలో 206 మంది వృత్తి కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, ప్రత్యేకాధికారి సత్యనారాయణ, మెప్మా సీఎంఎం పద్మావతి,డీఎంసీ వరలక్ష్మి,సీవోలు ఉమ,వెంకట రమణ, సత్య, కృష్ణవేణి పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment