పెరిగిన పెట్టుబడులు
చెరకు రైతులకు ఈ ఏడాది టన్నుకు రూ.2,900 ధర కల్పించారు. అయితే పెరిగిన కూలి రేట్లు, పెట్టుబడులు పెరగడంతో గిట్టుబాటు ధర లేక రైతులు చెరకు సాగు చేయడం తగ్గించారు. ఒకప్పుడు చెరకు పంట వేసుకుంటే సంక్రాతి సమయంలో ఎంతో ఆసక్తిగా చేసేవాళ్లం. 2014–19 మధ్య కాలంలో చెరకు సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేమెంట్లు సక్రమంగా ఇవ్వకపోవడంతో అప్పులు పాలైపోయాం – ఎ.చిట్టిబాబు, రైతు
గిట్టుబాటు ధర లేదు..
చెరకు సాగుతో నష్టమే తప్ప లాభాలు లేవు. దీంతో రైతు రానురాను సాగు చేయడం మానుకుంటున్నాడు. 2014లో చెరకు రైతుకు అడుగడుగునా చంద్రబాబు అన్యాయమే చేశారు. అప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం, గిట్టుబాటు ధర కల్పించకపోవడం జరిగింది. ఇపుడైనా కూటమి ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలు తెరచి, చెరకు రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తే మళ్లీ చెరకు సాగువైపు రైతులు ఆసక్తి చూపుతారు. మాకు ఏటికొప్పాక చక్కెర కర్మాగారం మూత పడడంతో గోవాడకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. టన్నుకు రూ.4వేల వరకు గిట్టుబాటు ధర కల్పిస్తే బాగేండేది. కానీ టన్నుకు రూ.2900 ఇవ్వడం వల్ల కనీసం పెట్టుబడులు మాట పక్కన పెడితే నష్టాలు వస్తున్నాయి. మద్దతు ధర లేకపోవడంతో చెరకు రైతులు పరిస్థితి దయనీయంగా మారింది.
– నారాయణమూర్తి, రైతు, గొలుగొండ
●
Comments
Please login to add a commentAdd a comment