తుమ్మపాల: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్‌లు, పోలీసు, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ ఎం.జాహ్నవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశం వివరాలను కలెక్టర్ విజయ్‌కృష్ణన్ విలేకరులకు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటనకు విశాఖపట్నం సహా అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు, ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావీయకుండా చూడాలన్న సీఎస్ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ సభకు జిల్లా నుంచి 40వేల మంది హాజరుకానున్నారని, వారికి 800 బస్సులను, భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్‌కు తెలిపామన్నారు. అచ్యుతాపురం, నక్కపల్లిలలో శంకుస్థాపన వేదికల వద్ద నుంచి వర్చువల్‌గా ప్రధానమంత్రితో ముఖాముఖికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్, జిల్లా పంచాయతీ అధికారి ఆర్.శిరీష రాణి, జిల్లా అదనపు ఎస్పీ ఎం. దేవాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment