ఘనంగా దేవానంద స్వామీజీ ఆరాధనోత్సవాలు
దేవరాపల్లి: సద్గురు దేవానంద సరస్వతి స్వామీజీ మహరాజ్(రిషీకేష్) 25వ ఆరాధన మహోత్స వాలు కొత్తపెంటలోని ఆశ్రమంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7న ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. తొలి రోజు ఆదివారం రిషీకేష్ నుంచి వచ్చిన పద్మనాభానంద స్వామీజీతో పాటు పలువురు సాధు సంతులు దేవానంద స్వామిజీ విగ్రహం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.రాత్రి భజన కార్యక్రమాలను, భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఆఽఖరి రోజు ఈ ఆరాధన మహోత్సవానికి దేశ వ్యాప్తంగా స్వామీజీ భక్తులు, శిష్యులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, మాజీ సర్పంచ్ రొంగలి శంకరరావు, దేవానంద స్వామి ఆధ్యాత్మిక జీవన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment