చెరకు రైతుల బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం
చోడవరం: చెరకు రైతుల బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించకపోతే ఉద్యమం తప్పదని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హెచ్చరించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రషింగ్ సీజన్ నాటికి రైతులకు పూర్తిగా బకాయిలను చెల్లించినట్టు చెప్పారు.పేమెంట్స్ టన్నుకు రూ.350 చెల్లించవలసి ఉండగా కూటమి ప్రభుత్వం నేటికీ పూర్తిగా చెల్లించలేదని చెప్పారు. గేటు ఏరియాకి సరఫరా చేసిన రైతులకు అదనంగా టన్నుకి మరో రూ.50చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. చెరకు రైతులకు, కార్మికుల జీతభత్యాలకు సంబంధించి బకాయిలు రూ.16.66 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీలో గత ఏడాదికి సంబంధించిన మొలాసిన్, పంచదార, కరెంటు విక్రయించడంతో రూ.9కోట్లు రానున్నాయని, కేవలం రూ.6కోట్లు మాత్రమే ప్రభుత్వం గ్రాంట్‌గా ఇస్తే సరిపోతుందని ధర్మశ్రీ చెప్పారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.170 కోట్ల మేర రుణాలు చేసి అప్పుల ఊబిలోకి ఫ్యాక్టరీని తోసేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ఫ్యాక్టరీపై భారం పడకుండా వడ్డీ చెల్లిస్తూ రూ.130కోట్ల వరకూ పాత అప్పు లు తీర్చామన్నారు. చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీతభత్యాలు చెల్లించేందుకు ఏటా రూ.8 కోట్ల నుంచి రూ.15కోట్లు వరకూ ఇచ్చామని, గోవాడ ఫ్యాక్టరీకి రూ.90 కోట్లు గ్రాంటుగా తెచ్చామని చెప్పారు. తమ పాలనలో ప్రతి ఏటా క్రషింగ్‌ను డిసెంబరు 15వతేదీ లోపులోనే ప్రారంభించేవారమని, కానీ ఈ ఏడాది జనవరినెల వచ్చినా పూర్తిస్థాయి క్రషింగ్ ప్రారంభించే పరిస్థితి కనిపించలేదన్నారు. ముందుగా క్రషింగ్ ప్రారంభిస్తే చలికి చెరకులో రస నాణ్యత బాగుండి మంచి దిగుబడి వస్తుందని దీనివల్ల రైతులకు, ఫ్యాక్టరీకి కూడా మేలు జరుగుతుందన్నారు.కూటమి ప్రభు త్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఈ ఏడాది క్రషింగ్‌ను సకాలంలో ప్రారంభించలేకపోయినట్టు చెప్పారు. గత మహాజనసభలో వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ఇచ్చిన గ్రాంటు కంటే ఒక్కరూపాయి అయినా అదనంగా తెస్తామని చెప్పిన చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ఇప్ప టి వరకూ ప్రభుత్వం నుంచి గ్రాంటుగా తేలేదన్నారు. పాత బకాయిలు పూర్తిగా చెల్లించకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని ధర్మశ్రీ హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
Comments
Please login to add a commentAdd a comment