జైలులో ‘సెల్’చల్
● కలకలం రేపుతున్న సెల్‌ఫోన్ల లభ్యత
ఆరిలోవ(విశాఖ): విశాఖ కేంద్ర కారాగా రంలో సెల్‌ఫోన్లు కలకలం రేపుతున్నాయి. జైల్ బ్యారక్‌లలో వరుసగా సెల్ ఫోన్‌లు బయటపడుతుండటంతో అధికారులు కంగుతింటున్నారు. నిషేధించిన వస్తువులు జైల్ లోపలకు ఎలా చేరుతున్నా యో అంతుచిక్కక కొత్తగా వచ్చిన అధికారులు తలలు పట్టుకొంటున్నా రు. శుక్ర వారం ఓ సెల్ ఫోన్ లభించింది. నాలు గు రోజుల కిందట రెండు సెల్ ఫోన్‌లు దొరికిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు బ్యారక్‌ల లో మూడు సెల్ ఫోన్‌లు దొరకడంతో ఇంకెన్ని సెల్ ఫోన్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో అని అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో భాగంగా శుక్రవారం నర్మదా బ్యారక్‌ను పరిశీలించినట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు తెలిపారు. ఈ తనిఖీలలో ఆ బ్యారక్ స్టోర్ రూం మెట్ల కింద గచ్చులో చేసిన రంధ్రంలో ఓ డబుల్ సిమ్ సెల్ ఫోన్ దొరికినట్లు తెలిపారు. దాన్ని స్వాధీనం చేసుకుని ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గత నెల 31న రెండు సెల్ ఫోన్‌లు, ప్రస్తుతం దొరికిన సెల్ ఫోన్లపై ఆరిలోవ పోలీసులు కేసులు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.
మరింత మెరుగ్గా 108,104 సేవలు
చోడవరం రూరల్: 108 అంబులెన్స్‌లు, 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)ల సేవలను మరింత మెరుగ్గా అందించడానికి తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వ దృష్టికి తీసు కెళతామని స్టేట్ నోడల్ ఆఫీసర్ ఎం.మురుగన్ బృందం తెలిపింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పర్యటించిన బృందం పలు 108, 104 వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా చోడవరానికి వచ్చిన బృందం ఉద్యోగులతో చర్చించింది. విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంది. సేవల మెరుగునకు వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. మురుగన్‌తో పాటు జిల్లా 108 విభాగం మేనేజర్ వి.వి.త్రినాథరావు, 104 విభాగం జిల్లా మేనేజర్ అచ్యుతరావు, ఓఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment