ఏకగ్రీవంగా పీసా కమిటీల ఎన్నికలు
నాతవరం: మండలంలోని ఎనిమిది గ్రామాల్లో శుక్రవారం పీసా కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్టు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి నాగశిరీషా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తుగా నాతవరం ఎస్‌ఐ సీహెచ్. భీమరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రశాంతంగా ముగిశాయని చెప్పా రు. కొత్తగా ఎన్నికై న పీసా కమిటీ ఉపాధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం ఐదేళ్లు పాటు ఉంటుందని ఆమె తెలిపారు. నూతనంగా ఎన్నికై న పీసా కమిటీలకు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
నేడు రెండు గ్రామాల్లో..
మండలంలో ధర్మవరం అగ్రహారం, కృష్ణాపురం అగ్రహారంలలో శనివారం పీసా కమిటీ ఎన్నికలు జరుగుతాయని నాగ శిరీషా తెలిపారు. ధర్మవరం అగ్రహారంలో ఎన్నికల అధికారిగా ఎన్.ప్రేమ్‌కుమార్, కృష్ణాపురం అగ్రహారంలో ఎన్నికల అధికారిగా ఈ.దేముడు వ్యహరిస్తారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారి వివరాలు..
గ్రామం ఉపాధ్యక్షుడు కార్యదర్శి
సుందరకోట జర్తా జోగిరాజు పాండవుల నూకరాజు
సరుగుడు పెయ్యల బాలరాజు మద్దేల గంగాధర్
రామన్నపాలెం కుంచె నాగేశ్వరరావు తరంబోయిన రమణ
సిరిపురం బండి దారబాబు ఉల్లి చిన్నబ్బాయి
కురువాడ పాశిల అప్పారావు సుర్ల వినాయక రాజు
మాధవ నగరం ఆర్లి రాఘవ సామల పైడికొండ
పి.ఎన్.డి.పాలెం వెలకాడ అప్పారావు కోరుబిల్లి పోతురాజు
కె.వి.శరభవరం కర్రిగోపి ప్రసాద్ రేగటి రాజుబాబు
Comments
Please login to add a commentAdd a comment