అనకాపల్లి జిల్లాలోనూ ఎమ్మెల్యేలదీ ఒక్కొక్కరిది ఒక్కో స్టెయిల్. ఇప్పటికే జనసేన అధిష్టానం నుంచి భారీగా విమర్శలు ఎదుర్కొని క్లాసులు పీకుతున్నా.... అస్సలు తగ్గేదేలే అని ఆయన రెచ్చిపోతున్నారు. ఆయన అవినీతి దూకుడుకు ఎవ్వరూ ఆనడం లేదు. ఆయన సోదరుడి అండతో అందినకాడికి దోచుకుంటున్నారు. పరిశ్రమల నుంచి పోస్టింగుల వరకూ... నేవీ నుంచి నరేగా నిధుల వరకూ ఆయనకు అడ్డులేకుండా పోయింది. ఇక మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని మండలానికో వ్యక్తిని షాడోగా మార్చుకున్నారు. అక్కడ కొత్తగా వెంచర్ వేయాలన్నా.... నిర్మాణాలు చేపట్టాలన్నా వీరి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఈయనకు నియోజకవర్గమంతా మొత్త 10 మంది వరకూ షాడోలుగా వ్యవహరిస్తున్నారు. మరో ఎమ్మెల్యే వ్యవహారాలన్నీ సతీమణితో పాటు కుమారులు చూసుకుంటుండగా... ఇంకో ఎమ్మెల్యే పెత్తనమంతా కుమారుడే దగ్గరుండీ మరీ చక్కబెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి పెద్దగా ఎక్కడా హడావుడి చేయకపోయినప్పటికీ సదరు ఎమ్మెల్యే అల్లుడు మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇదే జిల్లాలోని ఒకరు మాత్రం నిత్యం వార్తల్లో ఉంటున్నారు. సదరు ఎమ్మెల్యే అనుచరులు ఇప్పటికే భూకబ్జాలు, పోస్టింగుల్లో భారీగా వసూళ్లకు తెగబడటంతో అధిష్టానం దాకా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటివరకు అన్ని వ్యవహారాలను చక్కబెట్టిన సదరు వ్యక్తి తనకు తెలియకుండా చేశాడంటూ దూరం పెడుతున్నట్టు సర్దిచెప్పుకున్నారు. ఈ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలోని మండలానికి ఇద్దరు ముగ్గురు షాడోలుగా రెచ్చిపోతున్నారు.
ఎమ్మెల్యే భర్తదే పెత్తనం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే భర్తదే మొత్తం పెత్తనమంతా నడుస్తోంది. ఏ పోస్టింగు కావాలన్నా... ఆయన ఓకే అనాల్సిందే. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తి... ఎన్ని ఆరోపణలు వచ్చినా ముందుకేనంటూ నీడగా సాగుతున్నారు. ఒక నియోజకవర్గ ఇంచార్జీకి గతంలో పీఏగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పటికీ వెనుక నుంచి కథ మొత్తం నడిపిస్తున్నట్టు విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment