సౌత్‌జోన్ హాకీ పోటీలకు యలమంచిలి క్రీడాకారులు
సౌత్‌జోన్ హాకీ పోటీలకు ఎంపికై న క్రీడాకారులు
యలమంచిలి రూరల్: మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరగనున్న సౌత్‌జోన్ పోటీల్లో పాల్గొనే ఆంధ్ర విశ్వవిద్యాలయం హాకీ జట్టులో పట్టణానికి చెందిన 10 మంది క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు చైన్నె మద్రాస్ వర్సిటీలో జరిగే పోటీల్లో వీరు పాల్గోనున్నారు. బుధవారం చైన్నె బయలుదేరిన జట్టు సభ్యులను వర్సిటీ,యలమంచిలిలో ఏయూ స్పోర్ట్స్ విభాగం అధిపతి డాక్టర్ విజయ్‌మోహన్,జట్టు కోచ్ గాజుల రాంబాబు(యలమంచిలి), మేనేజర్ కొటారు దుర్గారావు(యలమంచిలి) అభినందించారు. సౌత్‌జోన్ హాకీ టోర్నమెంట్‌లో క్రీడాకారులు రాణించాలని వారంతా ఆకాంక్షించారు. జట్టుకు మామిడి విజయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment