సప్పరం వాహనంపై వెంకన్న తిరువీధి
ఇత్తడి సప్పరం వాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు
నక్కపల్లి: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఉపమాక వేంకటేశ్వర స్వామివారికి ఇత్తడి సప్పరం వాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి వేకువ జామున అభిషేకం జరిపారు. తదుపరి ఉత్సవమూర్తులకు, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామివారికి,గోదాదేవి అమ్మవారికి నిత్యపూజలు నిర్వహించిన అనంతరం ఉభయదేవేరులతోకూడిన స్వామివారిని ఇత్తడి సప్పరం వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తీరువీధి సేవలు నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై పాశురాలను విన్నపం చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఈకార్యక్రమంలో అర్చక స్వాములు వరప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment