బల్క్‌డ్రగ్‌పార్క్‌కు వ్యతిరేకంగా మత్స్యకారుల నిరసన
నక్కపల్లి : మండలంలో రాజయ్యపేట సమీపంలో బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ మంగళవారం పలువురు మత్య్సకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజయ్యపేట సముద్రతీరంలో ఇసుకపై కుప్పలుగా పోసి బల్క్ డ్రగ్‌పార్క్ వద్దు... అంటూ రాసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి బల్క్ డ్రగ్ పార్క్ పనులు ప్రారంభించడం సిగ్గు చేటన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదకర పరిశ్రమలకు బదులు వేరొక పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మండలంలో ఉన్న రసాయన పరిశ్రమల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ప్రజలు నివసించే పరిస్థితులు ఉండవన్నారు. రైతులు, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సీపీఎం మండల కన్వీనర్ ఎం రాజేష్, మత్య్సకారులు సోమేష్, భయ్యన్న, భూలోక, అప్పలరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment