ప్చ్‌...2024 | - | Sakshi
Sakshi News home page

ప్చ్‌...2024

Published Wed, Jan 1 2025 2:22 AM | Last Updated on Wed, Jan 1 2025 2:22 AM

ప్చ్‌

ప్చ్‌...2024

‘గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు, ఘోరాలు పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలతో పాటుగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయి. గంజాయి, సైబర్‌, సారా కేసులు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. గతేడాదిలో 15 హత్యలు, 25 హత్యాయత్నాలు జరిగితే ఈ ఏడాదిలో 25 హత్యలు, 38 హత్యా ప్రయత్నాలు నమోదయ్యాయి. మంగళవారం 2024వ సంవత్సర వార్షిక నివేదిక వివరాలు ఎస్పీ తుహిన్‌ సిన్హా మీడియాకు వెల్లడించారు.
గత ఏడాది 25 హత్యలు, 38 హత్యాయత్నాలు

సాక్షి, అనకాపల్లి :

మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా అనకాపల్లి తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్‌ శాఖలో సమర్ధవంతమైన సిబ్బంది పనితీరు, మెరుగైన పోలీసింగ్‌తో నేరాలను అదుపులో ఉంచగలిగామని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలను సమర్ధంగా నిర్వహించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించామన్నారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలందించామన్నారు. సిబ్బంది కోసం ప్రతి నెలా మూడో శుక్రవారం గ్రీవెన్స్‌ డే, హోంగార్డుల సమస్యలను పరిష్కరించడానికి దర్బార్‌ ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

చట్టాలపై అవగాహన కల్పించేలా...

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పోక్సో చట్టం, మహిళా చట్టాలు, ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌ వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశామని ఎస్పీ అన్నారు. పోలీసుశాఖలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడం, లోన్‌ యాప్‌ల వల్ల అనర్ధాలు, సైబర్‌ నేరాలు, బాల్య వివాహాలు అరికట్టడం పట్ల అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

51 శాతం కేసుల్లో శిక్షలు ఖరారు

2024లో డిస్పోజ్‌ అయిన కేసుల్లో 51 శాతం కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారయ్యాయి. మొత్తం 4,618 కేసులు డిస్పోజ్‌ కాగా..వాటిలో 2,367 కేసుల్లో నిందితులను శిక్షించారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా 2,734 ఎఫ్‌ఐఆర్‌ కేసులు, 5,315 పెట్టీ కేసులు డిస్పోజ్‌ అయ్యాయి. దర్యాప్తులో ఉన్న 12,623 పోలీసు కేసుల్లో 7,071 కేసులు పరిష్కరించారు.

గంజాయికు అడ్డుకట్ట..

మాదక ద్రవ్య రహిత జిల్లాగా చేసే విధంగా గంజాయి అక్రమ రవాణా మార్గాలను అరికట్టేందుకు 5 శాశ్వత చెక్‌పోస్ట్‌లను, 11 డైనమిక్‌ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి వాహన తనిఖీ పోలీసు జాగిలాలు, డ్రోన్లు నిఘా కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా ఉన్న 16 మండలాలలోని 63 గ్రామాలను గుర్తించి మండల, గ్రామ స్థాయి యాంటీ డ్రగ్‌ కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, జిల్లాలో 475 మందిపై హిస్టరీ షీట్‌లను కూడా తెరిచామని ఎస్పీ అన్నారు. గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు 161 కేసులు నమోదు చేసి మొత్తం 7326.43 కిలోల గంజాయి, 4 లీటర్ల హషీష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులతో సంబంధం ఉన్న 420 మందితో పాటుగా పరారీలో ఉన్న 126 మంది నిందితులను అరెస్టు చేశారు. 113 గంజాయి వాహనాలను సీజ్‌ చేశారు. రోలుగుంట పోలీసు స్టేషన్‌ పరిధిలో పడాల నాగేశ్వరరావు గంజాయి క్రయ విక్రయాల ద్వారా అక్రమంగా సంపాదించిన రూ.2 కోట్లు విలువ గల 15.36 ఎకరాల వ్యవసాయ భూమిని స్వాఽధీనం చేసుకున్నామన్నారు. సంకల్పం కార్యక్రమం ద్వారా 156 కాలేజీలు, 306 స్కూళ్లలో గల 72 వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించామని, మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స చేసేందుకు అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో 15 బెడ్లను ఏర్పాటు చేశారు.

696 రోడ్డు ప్రమాదాలు..

గతేడాదిలో 689 రోడ్డు ప్రమాదాల కేసుల్లో 294 మంది మృతి చెందారు. 2024లో నమోదైన 696 రోడ్డు ప్రమాదాల కేసుల్లో 316 మంది మృతి చెందారు. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా 2024 ఏడాదిలో 4,332 కేసులు నమోదయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 12,282 కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై 93,713 ఈ చలానాలు విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా 26 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి ఆయా ప్రదేశాలలో స్టాప్‌ బోర్డులు, షైన్‌ బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించుటకు కృషి చేశామన్నారు.

సారా కేసులూ..

2023లో 1378 నాటు సారా కేసుల్లో 1119 అరెస్ట్‌ చేశారు. 5,906 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 2024లో 277 నాటుసారాయి కేసులు నమోదు చేసి 4,287 లీటర్ల సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు 2,09,100 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసి 307 మందిని అరెస్టు చేశారు. బెల్ట్‌ షాపుల నుంచి 12,445 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని 2461 కేసులు నమోదు చేసి 2054 మందిని అరెస్ట్‌ చేశారు. 38 వాహనాలు సీజ్‌ చేశారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌పై 4,332 కేసులు

గత ఏడాది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిఫై 4,332 కేసులు నమోదు చేసి రూ.44,03,190 జరిమానా విధించారు. వారిలో నలుగురికి సాధారణ జైలు శిక్ష విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 12,282 మందిపై కేసులు నమోదు చేసి, రూ.23.08 లక్షలు జరిమానా విధించారు. 664 కేసుల్లో 2,610 మంది జూదగాళ్లను అరెస్టు చేసి రూ.48.04 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మొబైల్‌ ఫోన్ల రికవరీ...

మొబైల్‌ చోరీ కేసుల్లో అనకాపల్లి జిల్లా పోలీసు మొత్తం 8 విడతల్లో 2,208 మొబైల్‌ ఫోన్లను (సుమారు విలువ రూ.2 కోట్ల 80 లక్షల రూపాయలు) ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రికవరీ చేసి బాధితులకు అందించారు.

పీజీఆర్‌ఎస్‌కు 2,803 ఫిర్యాదులు

గడిచిన ఏడాది పీజీఆర్‌ఎస్‌లో 2,803 ఫిర్యాదులు, 464 సీసీసీ పిటిషన్‌లు నమోదయ్యాయి. వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా 10,939 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 108 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

తగ్గుముఖం పట్టని నేరాలు

277 సారా కేసుల్లో 307 మంది అరెస్ట్‌

2024 ఏడాది వార్షిక నివేదిక వెల్లడించిన ఎస్పీ తుహిన్‌ సిన్హా

నేరము...శిక్ష

పోస్కో కేసుల్లో...

చీడికాడ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోక్సో కేసులో 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. నాతవరం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి జీవితాంతం కఠిన కారాగార శిక్షతో పాటు రూ.12వేల జరిమానా విఽధించారు. మునగపాక పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఐదేళ్లలో కఠిన కారాగార శిక్షతో పాటు రూ.17వేల జరిమానా విధించారు. రోలుగుంట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు, ఫోక్సో కేసులో 3 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధించారు.

పెరిగిన హత్యలు

గత ఏడాది 2023లో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 15 హత్యలు జరగ్గా.. 25 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. 2024లో 25 హత్యలు, 35 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. 2 లాభాపేక్ష హత్యలు, 38 హత్యాప్రయత్నాలు, 34 తీవ్రగాయాల కేసులు నమోదయ్యాయి. 482 సాధారణ గాయాలు అయిన కేసులు నమోదయ్యాయి. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 2024లో 127 ఆస్తి సంబంధిత నేరాల్లో రూ.1,96,83,090 రికవరీ చేశారు. ఈ ఏడాది నమోదైన హత్య కేసుల్లో చాలా వరకు కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాల కారణంగా జరిగినవే.

161 గంజాయి కేసుల్లో 546 మంది అరెస్ట్‌.. 475 మందిపై హిస్టరీ షీట్‌

సైబర్‌ కేసులపై అప్రమత్తం

గతేడాదిలో 57 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో 103 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో సైబర్‌ మోసగాళ్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ. 2,41,53,923 ఫ్రీజ్‌ చేశారు. అంతేకాక పై కేసుల్లో రూ. 16,97,759 లను బాధితులకు తిరిగి అందజేశారు.

హంతకులకు కారాగారం..

కశింకోట పోలీస్‌ స్టేషన్‌లో 2017లో నమోదైన హత్య కేసులో కోర్టు నిందితుడికి జీవిత కఠిన కారాగార శిక్ష విధించింది. నాతవరం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో పదేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,00,000 జరిమానాను విధించారు. రోలుగుంట పోలీస్‌స్టేషన్‌లో 2017లో నమోదైన హత్యకేసులో నిందితునికి జీవిత ఖైదు విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్చ్‌...20241
1/4

ప్చ్‌...2024

ప్చ్‌...20242
2/4

ప్చ్‌...2024

ప్చ్‌...20243
3/4

ప్చ్‌...2024

ప్చ్‌...20244
4/4

ప్చ్‌...2024

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement