తాటిచెట్లపాలెం : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు, తీర్థయాత్రికుల కోసం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు.
●తిరుపతి–బనారస్(07107) స్పెషల్ రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 22వ తేదీల్లో (శనివారం) రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 10.58 గంటలకు దువ్వాడకు, సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బనారస్–విజయవాడ(07108) స్పెషల్ రైలు జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24వ తేదీల్లో (సోమవారం) సాయంత్రం 5.30 గంటలకు బనారస్‌లో బయల్దేరి మంగళవారం రాత్రి 11.23 గంటలకు దువ్వాడకు, బుధవారం తెల్లవారు 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటాయి.
●నరసాపూర్–బనారస్(07109) స్పెషల్ రైలు జనవరి 26, ఫిబ్రవరి 2వ తేదీల్లో (ఆదివారం) ఉదయం 6 గంటలకు నరసాపూర్‌లో బయల్దేరి అదేరోజు ఉదయం 10.58 గంటలకు, సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బనారస్–నరసాపూర్(07110) స్పెషల్ రైలు జనవరి 27 ఫిబ్రవరి 3వ తేదీల్లో (సోమవారం) సాయంత్రం 5.30 గంటలకు బనారస్‌లో బయల్దేరి, మరుసటిరోజు (మంగళవారం) రాత్రి 11.23 గంటలకు దువ్వాడకు, బుధవారం తెల్లవారు 5 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment