ఈవీఎం గొడౌను తనిఖీ
ఈవీఎం గొడౌను తనిఖీ చేస్తున్న కలెక్టర్
తుమ్మపాల : జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో గల ఈవీఎం గొడౌన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ కృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. గోడౌను త్రైమాసిక తనిఖీలలో భాగంగా గొడౌను సీళ్లను తీసి, నియోజకవర్గాల వారీగా భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లను, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలను, భద్రతా ఏర్పాట్లను పరిఽశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గొడౌనుకు సీళ్లు వేశారు. ఈ కార్యకమంలో జిల్లా రెవిన్యూ డివిజినల్ అధికారి వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, అగ్నిమాపక అధికారి పి.నాగేశ్వరరావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, జి.రాజు, కె.హరినాథబాబు, పి.నాగేశ్వరరావు, వి. వెంకట సత్యనారాయణ, టి.రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment