ఎకో టూరిజం అభివృద్ధి
తుమ్మపాల : జిల్లాలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి, ప్రచారానికి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఆమె ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తంతడి, సీతంపాలెం బీచ్‌లలో అభివృద్ధికి భూమి అందుబాటులో ఉందని, అక్కడ పర్యాటక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సోలారు లైటింగు, వాచ్ టవరు ఏర్పాటుకు పోలీసుశాఖ ప్రతిపాదనలు చేసిందని, టూరిజం శాఖ నుండి స్టాల్స్, టాయిలెట్స్, రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొండకర్ల ఆవను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడానికి, ఫెడల్ బోటు, ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాలాబు వాటర్ ఫాల్స్ వంటి ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో టూరిజం అబివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, జిల్లాలో పర్యాటక ప్రదేశాలపై విస్త్రత ప్రచారం కల్పించాలన్నారు. బొజ్జన్నకొండ వద్ద పుడ్ కోర్టు, కొండకర్ల ఆవ వద్ద ఫెడల్ బోట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బుద్దుని స్టూపాలు గల ప్రదేశాలను చరిత్ర ఆధారంగా అనుసంధానం చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ రూపొందించాలని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం బీచ్‌లలో విపరీతమైన రద్దీ ఉంటుందని, తంతడి, సీతంపాలెం బీచ్ లను అభివృద్ధి చేయడం ద్వారా విశాఖపట్నం వచ్చే టూరిస్టులను ఆకర్శించవచ్చన్నారు. జిల్లాలో అనేక దేవాలయాలు ఉన్నాయని, వాటికి ప్రచారం కల్పించడం ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అభివృద్ధి అధికారి కె.మనోరమ, అడిషనల్ ఎస్పీ ఎం. దేవప్రసాద్, ట్రావెల్ అండ్ టూర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ కె. విజయమోహన్, హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.వి.ప్రవీణ్ కార్తీక్, కళ్యాణి అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఐ.శ్రీనివాస్, ఆర్కియాలజీ డిపార్టుమెంటు కన్సర్వేటర్ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు
తంతడి, సీతంపాలెం బీచ్‌ల అభివృద్ధికి కార్యాచరణ
బొజ్జన్నకొండ, కొండకర్ల ఆవ వద్ద ఫుడ్ కోర్టుల ఏర్పాటు
జిల్లా టూరిజం కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
Comments
Please login to add a commentAdd a comment