న్యూ ఇయర్ వేడుకలకు దూరం
నర్సీపట్నం : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 1వ తేదీ వరకు సంతాప దినాలు ప్రకటించినందున న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం సమంజంసం కాదని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి ఒకటిన ఎవరూ తనను వ్యక్తిగతంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపవద్దని కోరారు.
దేవరాపల్లి : మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు నూతన సంవత్సర వేడుకులకు దూరంగా ఉంటున్నట్టు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం రోజున (బుధవారం) మాజీ డిప్యూటీ సీఎం బూడి జిల్లాలో అందుబాటులో ఉండరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించి అనకాపల్లి జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు మాడుగుల నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపేందుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment