ఓల్డ్ ఈజ్ గోల్డ్ !
● మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన ముత్యం లక్ష్మి
రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో డిస్క్‌త్రోలో బంగారు పతకం సాథించిన వెటరన్ క్రీడాకారిణి ముత్యం లక్ష్మి
చోడవరం : వయస్సు దేనికీ అడ్డం కాదని మరో సారి నిరూపించారు వెటరన్ క్రీడాకారిణి ముత్యం లక్ష్మి. వయస్సు మీద పడుతున్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా తనకు ఎంతో ఇష్టమైన మాస్టర్స్ క్రీడల్లో పాల్గొని నేటికీ అనేక పతకాలు సాధిస్తున్నారు ఆమె. 80 యేళ్ల వయస్సులోనూ ఆమె వెటర్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించడం అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాజాగా రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో చోడవరానికి చెందిన వెటరన్ క్రీడాకారిణి ముత్యం లక్ష్మి రెండు బంగారు పతకాలు సాధించారు. ఈనెల 28, 29 తేదీల్లో గుంటూరులో రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. మొదటి రోజు శనివారం జరిగిన పోటీల్లో డిస్క్ త్రో, జావెలిన్ త్రో పోటీల్లో ముత్యం లక్ష్మి మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. ఇప్పటికే గత 20 యేళ్లుగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి వెటరన్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో అనేక పోటీల్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు అనేకం సాధించారు. క్రీడలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయనడానికి ముత్యం లక్ష్మి ఒక ఆదర్శం. ఈమె సంపూర్ణ ఆరోగ్య వంతురాలుగా ఉంటూ ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మాస్టర్స్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించడంపై చోడవరం ప్రజలు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment