తుమ్మపాల: ఎస్సీ కులగణన జాబితాపై ఈ నెల 31వ తేదీ వరకు అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తారని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి కె.రాజేశ్వరి తెలిపారు. ఎస్సీ కులగణన వివరాలను ఈ నెల 26న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. జనవరి 6వ తేదీ వరకు అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారన్నారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం అదే నెల 10న కులగణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.
మూడు దశలలో తనిఖీ
పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉప కులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం ఇతర వివరాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటాపై అభ్యంతారాలను వీఆర్వో స్వీకరిస్తారు.
వీటిని మూడు దశలలో తనిఖీ చేస్తారు. 1. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్వో పరిశీలించి వివరాలను ఆర్‌ఐకి నివేదిస్తారు. 2. వీటిని ఆర్‌ఐ పునఃపరిశీలించి తహసీల్దార్‌కు రికమండ్ చేస్తారు. తర్వాత తహసీల్దార్ వీఆర్వో ఆర్‌ఐల నివేదికలో వివరాలను పరిశీలించి, తుది ఆమోదం తెలిపి ఆ వివరాల్ని ఫోర్టల్‌లో పొందుపరుస్తారు. 3.పొందు పరిచిన వివరాల్లో కచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాల్ని ర్యాండమ్‌గా తనిఖీ చేయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment