అమ్మకు లక్ష పుష్పార్చన
యలమంచిలి రూరల్: ధర్మవరంలో వున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర మాసం ప్రత్యేక పూజలతో కళకళలాడుతోంది. ఈ నెలలో గురు, శుక్రవారాల్లో భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడుతోంది. శుక్రవారం మహిళా భక్తులతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష పుష్పార్చన కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు వెలవెలపల్లి కోటేశ్వర కుమారశర్మ ఆధ్వర్యంలో సహస్రనామ పఠనాలతో, వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. సుమారు రెండు వేలమంది మహిళలు ఈ పూజల్లో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిటకిటలాడాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఎంతగానో పరవశించిపోయారు. పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొఠారు సాంబ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
కనకమహాలక్ష్మికి
సామూహిక కుంకుమ పూజలు
Comments
Please login to add a commentAdd a comment