లావణ్య చాలా యాక్టివ్
నేను లావణ్య ఇంటి పక్కనే ఉంటున్నాను. ఆమెతో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఆమె చాలా యాక్టివ్. సరదాగా, అందరితో కలివిడిగా ఉండేది. జయవందన డ్వాక్రా గ్రూపునకు ఆమె అధ్యక్షురాలు. ఎప్పుడూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోలేదు, ఒకసారి వెళ్లాలని ఉందని చెప్పేది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆమె చనిపోయిందని మంగళవారం అర్ధరాత్రి తెలిసింది. చాలా సేపు నేను ఆ విషయాన్ని నమ్మలేకపోయాను. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేని బాధను ఆ పిల్లలు ఎలా తట్టుకుంటారో అని ఆలోచిస్తేనే ఏడుపు వస్తోంది. ఆ వెంకటేశ్వరస్వామి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలి. – పప్పీ,
లావణ్య స్నేహితురాలు, వెంకటేశ్వర కాలనీ
మంచి స్నేహితులం
నేను, లావణ్య, పప్పీ ముగ్గురం మంచి స్నేహితులం. లావణ్య చనిపోయిందని తెలిశాక నాకు కాళ్లు చేతులు ఆడలేదు. అందరికీ సహాయం చేస్తుంది. ప్రతి నెలా డ్వాక్రా టీఎల్‌ఎఫ్ మీటింగ్‌లో కలుస్తుంటాం. కష్ట సుఖాలు మాట్లాడుకునేవాళ్లం. ఈ నెల 26న జరిగిన మీటింగ్‌లో కలిశాం. అప్పుడే తిరుపతి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నామని చెప్పింది. దేవుడి సన్నిధిలో ఇలా జరగడం చాలా బాధ అనిపించింది. నిన్నటి వరకు మాతో కలిసి ఉన్న లావణ్య ఇప్పుడు లేదంటే మనసుకు కష్టంగా ఉంది.
– సీహెచ్ రమ,
స్నేహితురాలు, వెంకటేశ్వర కాలనీ
●
Comments
Please login to add a commentAdd a comment