No Headline
జీవీఎంసీ 43వ వార్డు, వెంకటేశ్వర కాలనీకి చెందిన సూరిశెట్టి లావణ్య తన ఆడపడుచు, మరో ముగ్గురు మహిళలతో కలిసి ఈ నెల 5న వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి వెళ్లారు. టోకెన్ల కోసం క్యూలో ఉండగా జరిగిన తొక్కిసలాటలో ఆమె మృతి చెందారు. భర్త సతీష్ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి మరణవార్తను పిల్లలకు ఎలా చెప్పాలో తెలియక సతీష్ తీవ్ర వేదనకు గురవుతున్నారు. లావణ్య కాలనీలో అందరితో కలివిడిగా ఉండేవారని, జయవందన డ్వాక్రా గ్రూపునకు అధ్యక్షురాలని స్థానికులు గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment