No Headline
మద్దిలపాలేనికి చెందిన గుడ్ల రజనీ(47), ఆమె భర్త లక్ష్మారెడ్డి వైకుంఠ ద్వార దర్శనం కోసం రెండు రోజుల కిందట తిరుపతి వెళ్లారు. టోకెన్ల జారీ సమయంలో జరిగిన ఘటనలో రజనీ మృతి చెందారు. లక్ష్మారెడ్డి ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఎంఎస్ చదువు కోసం అమెరికాలో ఉన్నారు. కుమారుడి భవిష్యత్తు కోసం రజనీ నిత్యం వేంకటేశ్వర స్వామి, సాయిబాబాకు పూజలు చేసేవారని బంధువులు తెలిపారు. రజనీ పరమ భక్తురాలని, ఆమె ఇల్లు దేవాలయంలా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి అనంత లోకాలకు వెళ్లిపోయావా అంటూ రజనీ తోటి కోడళ్లు బోరు విలపించారు. కుమారుడి భవిష్యత్‌ను చూడకుండా కన్నుమూసిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. తిరుపతి నుంచి వారు పంపిన ఫొటోలు మొబైల్‌లో చూస్తూ ఆవేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment