బారులు తీరిన వాహనాలు
●ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ట్రాఫిక్ జామ్
దొడ్డబళ్లాపురం: వీకెండ్, క్రిస్మస్ నేపథ్యంలో బెంగళూరు నివాసులు సొంత ఊర్లకు, టూర్లకు వాహనాలలో బయలుదేరడంతో బెంగళూరు, మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే పై శనివారం తెల్లవారుజాము నుండే వాహనాలు బారులుతీరడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లే టోల్ వద్ద అయితే 5 కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నా రీచార్జ్ అయిపోవడంతో టోల్ వద్ద సిబ్బంది ఫీజు వసూలు చేస్తుండడంతో మరింత ఆలస్యం అయ్యింది. వాహనాలు భారీగా రోడ్డెక్కడంతో ఎక్స్‌ప్రెస్‌వేపై పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అలర్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment