‘ఆమె’ తలచుకుంటే అంతే..
అనంతపురం సెంట్రల్: మహిళా, శిశు సంక్షేమశాఖ(ఐసీడీఎస్)లో ‘ఆమె’ మాట శాసనంగా మారుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయం నెరపడంలో ఆమెది అందెవేసిన చేయిగా పేరుగాంచారు. ఆమె చేతిలో ఏకంగా ప్రాజెక్టు డైరెక్టర్‌లే బలి అవుతున్నారు. గతంలో విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన సుశీలదేవిని, తాజాగా జిల్లాలో సుదీర్ఘకాలంగా ఐసీడీఎస్‌లో సేవలందిస్తున్న వనజాఅక్కమ్మను నెలలు తిరక్కనే తిరుగుముఖం పట్టించారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ‘ఎప్పుడొచ్చామా అన్నది కాదు.. బుల్లెట్టు దిగిందా లేదా’ అన్న తరహాలో ఐసీడీఎస్‌లో ఆమె వ్యవహారశైలి నడుస్తోందనే విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ సీడీపీఓలకు అడహక్ పదోన్నతులు కల్పించారు. అందులో భాగంగా కంబదూరు సీడీపీఓగా పనిచేస్తున్న వనజాఅక్కమ్మకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. వనజాఅక్కమ్మకు ముందునుంచి జిల్లాపై అవగాహన ఉండటంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా నడిపిస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో మంత్రాంగం..
అయితే, అప్పనంగా అధికారాలు అనుభవించడం అలవాటుగా మారిన ఓ సీడీపీఓకు వనజాఅక్కమ్మ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేయడం ఏమాత్రం రుచించలేదు. అందులో భాగంగా రాష్ట్ర డైరెక్టర్ స్థాయి అధికారిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు రాకపోయినప్పటికీ వనజాఅక్కమ్మ పదోన్నతిపై పలు ఫిర్యాదులు చేయించడంలో సక్సెస్ అయ్యారు. గతంలో విశాఖపట్నం జిల్లా నుంచి పదోన్నతిపై జిల్లాకు వచ్చిన సుశీలాదేవిపై కూడా ఫిర్యాదులు చేయించి.. నెలలు తిరక్కనేఆమైపె బదిలీ వేటు వేయించారనే ఆరోపణలున్నాయి. తాజాగా వనజాఅక్కమ్మను ఉన్నఫళంగా మహిళా ప్రాంగణం మేనేజర్‌గా బదిలీ చేయడం వెనుక ఆమె హస్తం ఉందని తెలిసింది.
ఎమ్మెల్యేలకు
తాయిలాలు..
ఉన్నత సీట్లో కూర్చునేందుకు సదరు సీడీపీఓ జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం. ‘అంతా మీరు చెప్పినట్లు నడిపిస్తా’ అంటూ నమ్మబలికినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులనే కాదు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులను కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐసీడీఎస్‌లో ఆరితేరిన ఓ సీడీపీఓ
ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టులకే ఎసరు
నాడు సుశీలాదేవి..
నేడు వనజా అక్కమ్మ బలి
Comments
Please login to add a commentAdd a comment