జిల్లాను క్రీడా హబ్‌గా మారుస్తాం
అనంతపురం: జిల్లాను క్రీడా హబ్‌గా మారుస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ‘వీ వైబ్’ సంస్థ ఆధ్వర్యంలో ‘సే నో టూ డ్రగ్స్’ పేరుతో అనంతపురంలో ఆదివారం చేపట్టిన 10కే రన్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. డ్రగ్స్ నియంత్రణకు క్రీడలు దోహదపడుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అడిషనల్ ఎస్పీ మల్లిఖార్జున వర్మ, వీ వైబ్ సంస్థ ప్రతినిధి రాధా, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, జిల్లా క్రీడా ప్రాధికారి సంస్థ అధికారి ఉదయ్‌భాస్కర్, అర్బన్ టెక్ తేజారెడ్డి, ఎస్వీయూ ఎన్‌ఎస్‌ఎస్ అండ్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ పాకనాటి హరికృష్ణ, ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కోనంకి గంగారామ్, పద్మశాలి ఫెడరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు, రజక ఫెడరేషన్ డైరెక్టర్ పరమేశ్వర్, రాయలసీమ బలిజ సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
టెన్‌కే రన్ వరుసగా తొలి మూడు స్థానాలను అబ్బాస్ అలీ (చిత్తూరు), రాథోడ్ అనిల్ (హైదరాబాద్), రమేష్ చంద్ర (హైదరాబాద్) దక్కించుకున్నారు. మహిళా విభాగాల్లో హైదరాబాద్‌కు చెందిన ఉమ, స్వప్ప, సమ్రీన్ గెలుపొందారు. ఏజీఎస్ రెడ్డి సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు.
శాప్ చైర్మన్ రవినాయుడు
Comments
Please login to add a commentAdd a comment