బాల్యవివాహాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలను అరికట్టాలి

Published Fri, Sep 13 2024 3:00 AM | Last Updated on Fri, Sep 13 2024 3:00 AM

-

అనంతపురం మెడికల్‌: బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఈ భ్రమరాంబదేవి, ఐసీడీఎస్‌ పీడీ డాక్టర్‌ శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు బాల్య వివాహాల నియంత్రణపై ఇటీవల విడుదల చేసిన జీఓ(31, 39)లను వివరించారు. బాల్య వివాహ నిరోధక అధికారుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ఐసీడీఎస్‌, అంగన్‌వాడీ టీచర్లదే కీలకపాత్ర అని అన్నారు. బాల్య వివాహాలతో మానసికంగా, శారీరకంగా, సామాజిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ మంజునాథ్‌, సీడీపీఓలు ధనలక్ష్మి, ఉమాశంకరమ్మ, చైల్డ్‌లైన్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ కృష్ణమాచారి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement