కర్ణాటక మద్యం పట్టివేత
కంబదూరు: అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కంబదూరు, అనంతపురం ఎకై ్సజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం కుందుర్పి మండలం కొలిమిపాళ్యం చెక్‌పోస్టు వద్ద అనంతపురం ఎకై ్సజ్ సీఐ లక్ష్మీసుహాసిని, కంబదూరు ఎకై ్సజ్ సీఐ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కుందుర్పి మండలం జంబుగుంపలకు చెందిన శివన్న, కుందుర్పి గ్రామానికి చెందిన బసవరాజు ద్విచక్రవాహనాల్లో కర్ణాటక మద్యాన్ని తీసుకోస్తూ పట్టుబడ్డారు. నిందితులను అరెస్ట్ చేసి, మద్యంతో పాటు వాహనాలను సీజ్ చేశారు.
చీటింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్
గుత్తి: ప్రభుత్వ శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... కర్నూలుకు చెందిన మేరి సునీత, అన్నమయ్య జిల్లాకు చెందిన గుర్రం ప్రసాదరెడ్డి, షేక్ బాబ్జాన్ సాహెబ్... గుత్తికి చెందిన నిఖిల్‌తో పాటు మరి కొందరు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.15 లక్షలు వసూలు చేసుకుని మోసం చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment