No Headline
అనంతపురం: ఖాకీ చొక్కాకు అవినీతి మరక అంటుతోంది. కొందరు పోలీసులు నేరస్తులతో స్నేహం చేస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు, పేకాట నిర్వాహకులతో జట్టుకట్టి అవినీతికి పాల్పడుతున్నారు. సివిల్ కేసుల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, అమ్మకాలను రూపుమాపేందుకు ఉన్నతాధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, అసాంఘిక శక్తులకు ముందస్తుగా సమాచారం అందించి వారిని తప్పిస్తున్నారు. పోలీసు ప్రతిష్టను మసకబారుస్తున్నారు.
విచారణలో బహిర్గతం..
రెండు రోజుల క్రితం జిల్లాలో ఏకంగా 15 మంది కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపడం చర్చనీయాంశమైంది. వీరిలో పలువురు గంజాయి స్మగ్లర్లతో కలిసి అవినీతికి పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడిన నిందితులను విచారించగా వీరి బాగోతం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
రెండో జాబితా సిద్ధం!
అవినీతి పోలీసుల వివరాలను సేకరించే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. రెండో జాబితా సిద్ధమైందని, త్వరలో మరికొందరు పోలీసులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే జాబితాలో పేర్లు చేరుస్తున్నారు. ఇందులో సీఐలు, ఎస్‌ఐలు కూడా ఉన్నట్లు సమాచారం. పేకాట స్థావరాలకు దన్నుగా నిలుస్తున్న ఎస్‌ఐల వివరాలను సైతం పోలీసు ఉన్నతాధికారులు సేకరించారు. సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ సెటిల్‌మెంట్‌లు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి.
జిల్లాలో 15 మంది పోలీసులను వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు
ఉన్నతాధికారుల పరిశీలనలో మరికొన్ని పేర్లు!
Comments
Please login to add a commentAdd a comment