పంచాయతీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు
ఉరవకొండ: స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు అన్నారు. బుధవారం ఆయన మేజర్ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ప్రజా సమస్య పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. పన్ను వసూళ్లపై ఆరా తీశారు. పంచాయతీ ఆస్తులున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈఓ గౌస్‌సాహెబ్‌ను ఆదేశించారు.
1న యూటీఎఫ్
జిల్లా స్వర్ణోత్సవ మహాసభలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబరు 1న రాయదుర్గంలో జిల్లా స్థాయి స్వర్ణోత్సవ మహాసభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను బుధవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యూటీఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడేందుకు విద్యార్థుల సంఖ్యను పెంచాలని పిలుపునిచ్చిన సంఘం యూటీఎఫ్ అన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి లింగమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, నాయకులు గంగాధర్, శివ, రుద్రప్ప, మెడికల్ రెప్స్ అసోసియేషన్ నాయకుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment