బంగారు దుకాణాలపై విజి‘లెన్స్’
అనంతపురం క్రైం: నగరంలోని పలు బంగారు దుకాణాలపై బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక గాంధీబజార్‌లోని బంగారు దుకాణాల్లో డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో సోదాలు చేశారు. దుకాణదారులు తూకాల్లో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. గొంది నాగయ్య శెట్టి జ్యువెలరీస్, సయ్యద్ జ్యువెలరీస్‌లలో కొలతల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పలువురు బంగారు వ్యాపారులు దుకాణాలు మూసివేసి ఉడాయించారు. దాడుల అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. సయ్యద్ జ్యువెలరీస్ దుకాణ యజమానులు హాల్‌మార్క్ సర్టిఫికెట్ చూపలేదన్నారు. మూడు దుకాణాల యజమా నులకు నోటీసులు జారీ చేశామన్నారు. బంగారు తూకాల్లో మిల్లీగ్రాముల మేర మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. కొనుగోలు దారులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇకపైనా దాడులను కొనసాగిస్తామని తెలిపారు.
దాడుల పుకార్లతో పరారు..
తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలో లీగల్ మెట్రాలజీ (తూనికలు, కొలతల) అధికారులు దాడులు చేస్తున్నారన్న పుకార్లతో బంగారు షాపుల యజమానులు దుకాణాలు మూసివేసి పరారయ్యారు. పట్టణంలో పెద్దబజార్‌లోని బంగారు దుకాణానికి బుధవారం మధ్యాహ్నం ఓ ఉద్యోగి ప్రభుత్వ వాహనంలో వచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్న బంగారు షాపుల యజమానులు దుకాణాలను మూసివేసేశారు. ఒక్కసారిగా దుకాణాలు మూత పడటంతో పట్టణ ప్రజలు అయోమయంలో పడ్డారు.
దాడుల నేపథ్యంలో
పరారైన దుకాణ యజమానులు
Comments
Please login to add a commentAdd a comment