అలవెన్స్ వాత... ప్రచార రోత!
అనంతపురం క్రైం: ఆర్టీసీ కార్మికులను కూటమి సర్కారు చిన్నచూపు చూస్తోంది. రాత్రి విధులు నిర్వర్తించగా వారికి వచ్చే అలవెన్సుల్లోనూ కోత విధించింది. కడుపుపై కొట్టడమే కాకుండా ఏదో ఉద్ధరించినట్లు ప్రచార ఆర్భాటం చేస్తుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాలు.. ఆర్టీసీలో రోజూ రాత్రి విధులు నిర్వర్తించే కార్మికులకు అలవెన్సుగా రూ.300 ఇచ్చేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇటీవలి వరకూ ఆ మేర డబ్బు అందించారు. దీంతో చిరుజీవులు ఎంతో ఊరట పొందారు.
కూటమి ‘కట్’కటా..
ఇటీవల ఎన్నికల సమయంలో సాంకేతిక కారణాలతో అలవెన్స్ బిల్లులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై శీతకన్ను వేసింది. అలవెన్సు డబ్బు అందించాలంటూ ఆరు నెలలుగా కార్మికులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే గతంలో రూ. 300 ఇచ్చే అలవెన్సును రూ.150కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందిది. ఈ మేరకు జీఓ విడుదల చేసింది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు రాత్రి విధుల అలవెన్సులు రూ. 60 లక్షలు అందాల్సి ఉండగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అదికాస్త రూ.30 లక్షలకు చేరుకుంది. అరకొర ఆదాయాన్ని కూడా ప్రభుత్వం లెక్కగట్టి తగ్గించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
వందల మందిపై ప్రభావం..
అనంతపురం ఆర్టీసీ రీజియన్‌లో రోజూ సుమారు 1,200 మంది కార్మికులు విధుల్లో ఉంటున్నారు. రాత్రి వెళ్లే బస్సుల (నైట్‌హాల్ట్)కు గాను అలవెన్సు కింద డబ్బు అందుకునేవారు. ఇందులో డ్రైవరుతో పాటు కండక్టరు, గ్యారేజీ సిబ్బంది కూడా ఉన్నారు. అధికారంలోకి రాగానే జీవితాల్లో వెలుగులు నింపుతామని మోసపూరితమైన హామీలిచ్చిన చంద్రబాబు... కొత్త పథకాలు అమలు చేయలేదు సరికదా, ఉన్నవాటికీ నేడు కోత పెడుతుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. సర్కారు అన్యాయంపై గళం విప్పాలని చూసిన కార్మికులపై ఆంక్షలు విధించినట్లు వారు చెబుతున్నారు. తమ ఆవేదనను కనీసం మీడియాకు చెప్పేందుకు కూడా జంకుతున్నారు.
ఆర్టీసీ కార్మికుల కష్టంపై కూటమి కుట్ర
రాత్రి విధుల అలవెన్సుల్లో సగం కోత
అనంత రీజియన్‌లో
రోజుకు 1,200 మందికి నష్టం
కార్మికులకు ఎంతో మేలు చేసినట్లు సర్కార్ ప్రచార ఆర్భాటం
నమ్మించి నట్టేట ముంచిన
ప్రభుత్వంపై కార్మికుల పెదవి విరుపు
Comments
Please login to add a commentAdd a comment