మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శిగా విజయ్‌కుమార్
గుంతకల్లుటౌన్: దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్ నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో జోనల్ కార్యదర్శి సీహెచ్ శంకర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన మజ్దూర్ యూనియన్ 7వ త్రైవార్షిక జనరల్ కౌన్సిల్ సమావేశంలో జోన్ పరిధిలోని వివిధ డివిజన్ల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్, అధ్యక్షుడిగా రేణిగుంటకు చెందిన లోకోపైలట్ బీఎం బాషా, అదనపు సహాయ కార్యదర్శిగా శ్రీనివాసులు, జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సురేష్‌కుమార్‌ను ఎన్నుకున్నారు.
వ్యక్తి దుర్మరణం
బెళుగుప్ప: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప (51) వ్యక్తిగత పనిపై శుక్రవారం బెళుగుప్పకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. నక్కలపల్లి గేట్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వరి గడ్డి లోడుతో వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన తిమ్మప్ప తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య కళావతి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శివ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment