కాలుష్యాన్ని నియంత్రించగలిగాం
పుట్టపర్తికి విచ్చేస్తున్న దేశవిదేశాల భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వాతావరణ కాలుష్య నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పెంపుపై దృష్టి సారించాం. సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుతో చాలా వరకూ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించగలిగాం. విద్యుత్ బిల్లులు ఆదా అయ్యాయి. ట్రస్ట్ విస్తరించిన ప్రతి ప్రాంతంలోనూ సౌర ఫలకాల ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నాం. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే బొగ్గు, నీళ్ల లభ్యత కాలక్రమేణా తగ్గిపోయే ప్రమాదముంది కావున, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – ఆర్‌జే రత్నాకర్‌రాజు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ
Comments
Please login to add a commentAdd a comment