‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంది ఆ ఎక్సైజ్‌ సీఐ తీరు. మద్యం అక్రమ అమ్మకాలను అరికట్టాల్సిన ఆయన.. ఆ విషయంతో తనకు సంబంధమే లేదన్నట్లుగా ‘మామూలు’గా వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులకు కూడా ఇవ్వాల్సి ఉందంటూ భారీగా ‘రేటు’ ఫిక్స్‌ చేశారు. నా | - | Sakshi
Sakshi News home page

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంది ఆ ఎక్సైజ్‌ సీఐ తీరు. మద్యం అక్రమ అమ్మకాలను అరికట్టాల్సిన ఆయన.. ఆ విషయంతో తనకు సంబంధమే లేదన్నట్లుగా ‘మామూలు’గా వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులకు కూడా ఇవ్వాల్సి ఉందంటూ భారీగా ‘రేటు’ ఫిక్స్‌ చేశారు. నా

Published Thu, Dec 26 2024 2:38 AM | Last Updated on Thu, Dec 26 2024 2:38 AM

‘అడిగ

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద

సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైన్‌షాపులు, బార్‌ల యాజమాన్యాలు నెలనెలా ఎంత చెల్లించుకోవాలో ఓ ఎకై ్సజ్‌ సీఐ ఫిక్స్‌ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇక నుంచి ఒక్కో బార్‌ నుంచి నెలకు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. వైన్‌ షాపునకు రూ.20 వేలు ఇవ్వాలని చెప్పారు. దీంతో బార్‌ల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే బార్‌లను సదరు సీఐ నడుపుకోలేరంటూ వార్నింగ్‌ ఇచ్చారని వాపోతున్నారు. వసూలు చేసిన సొమ్ములో అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ), డిప్యూటీ కమిషనర్‌ (డీసీ)లకు వాటా కూడా ఇవ్వాల్సి ఉంటుందని సదరు సీఐ చెప్పినట్టు పలువురు బార్‌ల యజమానులు తెలిపారు. ఇక.. లిక్కర్‌ డిపో వద్ద ప్రత్యేకంగా మాట్లాడుకోవాలని, అది తమ పరిధిలోకి రాదని ఆయన చెప్పారని ఓ వైన్‌షాపు యజమాని తెలిపారు. అక్కడ డిపో మేనేజర్‌గా బి.వెంకట నాయుడు ఉంటారని, ఆయనతో మాట్లాడుకోవాలని చెప్పినట్టు తెలిసింది.

చూసీ చూడనట్టు..

బెల్టుషాపులు నిర్వహిస్తే ‘బెల్టు’ తీస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు డాంబికాలు పలుకుతున్నారు. కానీ జిల్లాలో చూస్తే వైన్‌షాపులు బార్‌లను తలపిస్తున్నాయి. ఎక్సైజ్‌ అధికారుల వసూళ్ల కారణంగానే విచ్చలవిడిగా పర్మిట్‌రూములు ఏర్పాటయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ‘మామూళ్ల మత్తు’లో అడిగే వారే కరువయ్యారు. అనంతపురంలోని రామ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ సమీపంలో ఉన్న ‘రుద్ర వైన్స్‌’ పక్కన అనధికార బార్‌ నడుస్తోంది. ఉదయం 10 గంటల నుంచే బహిరంగంగా ఇక్కడ మద్యం తాగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదొక్కటే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా వైన్‌షాపుల వద్ద ఇదే పరిస్థితి. అధికారులకు అడిగినంత ఇచ్చుకుంటూ వైన్‌ షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు లైసెన్సు ఫీజు కింద చెల్లించిన తాము తీవ్రంగా నష్టపోతున్నామని బార్‌ల యాజమాన్యాలు వాపోతున్నాయి. పర్మిట్‌ రూములు నిలిపివేయాలంటూ ఇప్పటికే ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

మద్యం ఏరులు..

మరోవైపు జిల్లాలో బెల్టుషాపులు యథేచ్ఛగా ఏర్పాటు చేస్తుండటంతో మద్యం ఏరులై పారుతోంది. నియంత్రించే నాథులే కరువయ్యారు. గతంలో ‘సెబ్‌’ పేరుతో బహిరంగ మద్యపానం, అక్రమమద్యంపై ఎక్కడికక్కడ కఠినంగా వ్యవహరించేవారు. ఇప్పుడు ‘సెబ్‌’ లేకపోగా, ఎక్సైజ్‌ విభాగం చేష్టలుడిగి చూస్తోంది. స్వయానా ఎమ్మెల్యేలే తమ షాపుల పక్కన పర్మిట్‌ రూములు ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి వరకూ మద్యం తాగిస్తున్నారు. పట్టపగలే ఇలా జరుగుతున్నా ఎకై ్సజ్‌ అధికారులుగానీ, సివిల్‌ పోలీసులు గానీ కిమ్మనడం లేదు.

ఓ ఎక్సైజ్‌ సీఐ సెప‘రేటు’

ఒక్కో బార్‌ నుంచి నెలకు రూ.50 వేలు, వైన్‌షాపు నుంచి రూ.20 వేలు మామూళ్లివ్వాలని హుకుం

లిక్కర్‌ డిపో వద్ద వేరేగా మాట్లాడుకోవాలని సూచన

అడిగినంత ఇస్తే

పర్మిట్‌ రూములకూ అనుమతి

ఏసీ, డీసీ భాగస్వాములని చెబుతున్న వైనం

No comments yet. Be the first to comment!
Add a comment
‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద1
1/4

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద2
2/4

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద3
3/4

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద4
4/4

‘అడిగినంత కొట్టు.. నీ వైపు చూస్తే ఒట్టు’ అన్నట్లుగా ఉంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement