సీపీఎం జిల్లా కార్యదర్శిగా నల్లప్ప
అనంతపురం అర్బన్: సీపీఎం జిల్లా నూతన కమిటీ ఎన్నికై ంది. ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించిన జిల్లా మహాసభలో 26 మంది సభ్యులతో కమిటీని ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా ఓ.నల్లప్ప, కార్యదర్శి వర్గ సభ్యులుగా వి.రాంభూపాల్, ఎస్.నాగేంద్రకుమార్, ఎం.బాలరంగయ్య, వి.సావిత్రి, బి.శ్రీనివాసులు, వి.రామిరెడ్డి, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా ఆర్‌వీనాయుడు, నాగమణి, రామాంజినేయులు, తరిమెల నాగరాజు, వెంకటనారాయణ, నిర్మల, అచ్యుత్ ప్రసాద్, మల్లికార్జున, భాస్కర్, జగన్‌మోహన్‌రెడ్డి, మారుతీప్రసాద్, ముత్తూజా, పరమేష్, నాగరాజు, రమేష్‌తో పాటు ఇద్దరు అంతర్గత సభ్యులను ఎన్నుకున్నారు.
సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు
మహాసభల్లో తీసుకున్న తీర్మానాలపై బుధవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో విలేకరులతో సీసీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌తో కలిసి జిల్లా నూతన కార్యదర్శి నల్లప్ప మాట్లాడారు. జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తామన్నారు. హెచ్‌ఎల్‌సీ ఆధునీకరణ, హంద్రీ–నీవా కాలువ వెడల్పు, పంటకాలువ నిర్మాణం, ఉద్యాన పంటల ఆధారిత పరిశ్రల ఏర్పాటు, వృత్తుల పరిరక్షణ, వృత్తిదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఏటా రూ.5 వేల కోట్ల కేటాయింపునకు సీపీఎం స్వతంత్రంగా ఆందోళనలు చేయడంతో పాటు కలిసి వచ్చే శక్తులతో ఐక్య ఉద్యమాలు నిర్మిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment