మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలి : ఎస్టీయూ
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ఇన్‌చార్జ్ సి.నాగరాజు, పరిశీలకులు గోకారి డిమాండ్ చేశారు. ఎస్టీయూ 78వ జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నాగరాజు, గోకారి మాట్లాడుతూ... రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. లేకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పాఠశాల సహాయకులకు జూనియర్ లెక్చరర్‌గా పదోన్నతులు కల్పించాలన్నారు. మునిసిపల్ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలన్నారు. జీఓ 84ను సవరించి బదిలీలు, పదోన్నతులకు శాశ్వత కోడ్ చట్టం రూపొందించాలన్నారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.రామాంజనేయులు, ఆర్థిక కార్యదర్శి జి.ప్రసాద్, నాయకులు హరిప్రసాద్‌రెడ్డి, శ్రీరాములు, జ్యోతి, సూర్యుడు, చంద్రశేఖర్, శివయ్యఆచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment