పెద్దవడుగూరు: మండలంలోని కాశేపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా వద్ద ఆదివారం చోటు చేసుకున్న ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్ మండలం లాల్గాడి మలక్‌పేట్‌కు చెందిన సయ్యద్ రహంతుల్లా కుమారుడు శిబ్ఘతుల్లా (36) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... తన మామ సయ్యద్ యాసీన్, బామ్మర్ది సయ్యద్ హయ్యాత్ షాహెర్గర్‌తో కలసి కారులో బెంగళూరుకు శిబ్ఘతుల్లా బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే కారు టైర్ పంఛర్ కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైర్ మార్చుకున్నారు. అనంతరం కారు ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో శిబ్ఘతుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే పామిడిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పెద్దవడుగూరు ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment