కోలాహలంగా పార్వేట..
పాలపొంగుల ఉత్సవం ముగిసిన తర్వాత స్వామివారు సాయం సంధ్యావేళలో రైల్వేస్టేషన్ సమీపంలోని పార్వేట మండపం వద్దకు చేరుకున్నారు. తర్వాత రైలు కట్ట వద్ద ఎప్పటి లాగానే ఆచారం ప్రకారం కుందేలును జనం మధ్యకు వదిలారు. ఇలా ఒకటి తర్వాత మరొకటి చొప్పున జనం మధ్యకు నాలుగైదు కుందేళ్లను వదిలారు. ఆ సమయంలో కాసేపు భక్తుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. పార్వేట ఉత్సవంలో ఒకప్పుడు కుందేలు స్థానంలో పులిని వదిలే వారని భక్తులు తెలిపారు. భక్తులకు హాని కల్గిస్తుందని కొన్నేళ్లుగా కుందేలును వదులుతున్నట్లు పేర్కొన్నారు. పార్వేట పూర్తి కాగానే స్వామివారు రాయచోటి రోడ్డులో ఉన్న శమీ మండపం వద్దకు చేరుకొని అక్కడ పూజలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment