పెరిగిన టెంకాయల విక్రయ ఆదాయం
గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి శివారున 44వ జాతీయ రహదారి పక్కన వెలసిన బాటసుంకులమ్మ ఆలయంలో టెంకాలయ విక్రయానికి మంగళవారం వేలం నిర్వహించారు. వేలం దక్కించుకున్న వచ్చే ఏడాది సంక్రాంతి వరకూ ఆలయం వద్ద టెంకాయలను విక్రయించుకునే హక్కును పొందుతారు. ఈ క్రమంలో మొత్తం 12 మంది టెండర్‌దారులు రూ.500 ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య రూ.35.60 లక్షలతో కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు. గ తేడాది రూ.28 లక్షలకు పలికిన వేలం పాట ఈ ఏడాది రూ.35.60 లక్షలకు ఖరారు కావడంతో రూ.7.60 లక్షల అదనపు ఆదాయం సమకూరినట్లైంది. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు కర్లకుంట రమేష్‌బాబు, అంబటి నరసింహులు, వెంకట్రాముడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment