నూనె బాండ్లిలో పడి చిన్నారి మృతి
డి.హీరేహాళ్ (రాయదుర్గం): సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు, వేడి నూనెలో పడి మరో చిన్నారి మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... రాయదుర్గం మండలం ఆవులదట్లకు చెందిన నాగలక్ష్మి, నవీన్ దంపతులు ఈ నెల 11న ఇంట్లో పూరీలు చేశారు. అనంతరం నూనె బాండ్లీని కింద పెట్టి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో వారి మూడేళ్ల వయసున్న కుమారుడు శ్రీనివాసులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు వేడి నూనె బాండ్లీలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కుటుంబసభ్యుల వెంటనే అనంతపురానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తరలించారు. చికిత్సకు స్పందించక బుధవారం చిన్నారి మృతి చెందాడు.
విద్యుత్ షాక్‌తో...
డి.హీరేహాళ్‌కు చెందిన నాగరాజు, దేవమ్మ దంపతుల మూడో కుమారుడు గణేష్ (22) పెయింటర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. మంగళవారం సోమలాపురంలో తిప్పేస్వామి ఇంటికి పెయింటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి గోడపై నుంచి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బళ్లారిలోని వైద్యశాలకు తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతిచెందాడు. ఘటనపై ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన యువకుడు
Comments
Please login to add a commentAdd a comment