సాక్షి, టాస్క్‌ఫోర్స్: దశాబ్దాలుగా సాగులో ఉన్న తన పొలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రెబ్బల నాగమ్మ (95) మృతదేహాన్ని ఉద్దేవపూర్వకంగా ఖననం చేశారని, ఇలా ఎలా చేస్తారంటూ అధికారులను రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు చిల్రా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఘటనపై గురువారం రామగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంటిమద్ది గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 388–3లో 4.9 ఎకరాల భూమిని 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రెబ్బల శ్రీరాములు, రెబ్బల రామకృష్ణయ్య తల్లి నాగమ్మ అనారోగ్యంతో బుధవారం మృతి చెందితే దౌర్జన్యంగా తన పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి తాను ఊరెళ్లాలని, వచ్చిన తర్వాత ఈ విషయం తెలియడంతో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో శ్మశాన వాటిక ఉన్నా.. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఇదే విషయమై తహసీల్దార్‌కూ బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment