మద్యపాన నిషేధిత గ్రామంగా బోర్డు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

మద్యపాన నిషేధిత గ్రామంగా బోర్డు ఏర్పాటు

Published Fri, Jan 17 2025 1:45 AM | Last Updated on Fri, Jan 17 2025 1:45 AM

మద్యప

మద్యపాన నిషేధిత గ్రామంగా బోర్డు ఏర్పాటు

ఆదర్శంగా నిలిచిన వదనకల్‌ గ్రామస్తులు

మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌

పావగడ: తమ గ్రామంలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించి శాంతి భద్రతలు నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ వదనకల్‌ గ్రామస్తులు గురువారం వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామ నడిబొడ్డున ‘మద్యపాన నిషేధిత గ్రామం’ అని బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖుడు బ్రహ్మేంద్రచార్‌ మాట్లాడారు. గ్రామంలో మద్యం విక్రయాలతో మందుబాబుల బెడద ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా యువకులు మద్యానికి బానిసై పెడదారి పడుతున్నారన్నారు. సాయంత్రం గ్రామంలో మహిళలు స్వేచ్ఛగా బయట తిరగలేకపోతున్నారన్నారు. ఎకై ్సజ్‌ అధికారులు, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా మద్యం విక్రయాలను అరికట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులంతా సమావేశమై చర్చించుకున్న అనంతరం తమ గ్రామాన్ని మద్యపాన నిషేధిత గ్రామంగా పేర్కొంటూ గ్రామ నడిబొడ్డున బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామంలో మద్యం అమ్మకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ సాధనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్‌ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అనంతరం ఇకపై తమ గ్రామంలో మద్యం విక్రయాలు చేపట్టకూడదని విక్రయదారులను హెచ్చరించారు.

బైక్‌ను ఢీకొన్న కారు

బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... తాడిమర్రికి చెందిన బండారు రాముడు ద్విచక్రవాహనంపై గురువారం ముదిగుబ్బ మండలం గొంగటిలింగాయపల్లిలో సమీప బంధువుల ఇంట శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన బత్తలపల్లి మండలం రామాపురం కూడలి వద్ద జాతీయ రహదారిని క్రాస్‌ చేస్తుండగా అనంతపురం నుంచి కదిరి వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో రాముడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రునికి స్థానికులు సపర్యలు చేసి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మద్యపాన నిషేధిత గ్రామంగా బోర్డు ఏర్పాటు 1
1/1

మద్యపాన నిషేధిత గ్రామంగా బోర్డు ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement