మహాసమాధిని సందర్శించిన ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ డైరెక్టర్
ప్రశాంతి నిలయం: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఉన్న పబ్లిక్ పాలసీ–పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌పై సివిల్ సర్వీసెస్ శిక్షణా సంస్థ (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ – ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) డైరెక్టర్ శ్రీరామ్ తనకంటి మంగళవారం ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ఈ సరంద్భంగా ఆయనకు శాంతి భవన్ అతిథి గృహం వద్ద ఆ జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ వి.రత్న, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ... పుష్ఫగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాససమాధిని దర్శించుకున్నారు.
చిరుత దాడిలో మేక మృతి
గుడిబండ: చిరుత దాడిలో మేక మృతి చెందిన ఘటన గుడిబండ మండలం గుణేమోరబాగల్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు... గుణేమోరబాగల్‌కు చెందిన హనుమక్క... జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జీవాలను తన పొలం వద్ద దొడ్డిలో వదిలి ఇంటికి వెళ్లింది. బుధవారం ఉదయం వెళ్లి చూసేసరికి ఓ మేక మృతి చెంది కనిపించింది. మెడపై చిరుత పంటి గాట్లను గుర్తించి సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ సంజీవరాయుడు అక్కడకు చేరుకుని పరిశీలించారు. చిరుత సంచారాన్ని గమనిస్తూ, దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వన్యప్రాణుల వల్ల నష్టం వాటిల్లిత్తే బాధిత రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment