Telugu States Heavy Rains Latest News Updates
రేపు ఎన్టీఆర్ జిల్లా స్కూళ్లకు సెలవు
- జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరద ఉధృతి
- బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
- జిల్లా కలెక్టర్ జి.సృజన ప్రకటన
36 గంటల్లో.. ట్రాక్ పునరుద్ధరణ రికార్డు
- మహబూబాబాద్ జిల్లా: ఇంటికన్నె వద్ద రైల్వే టట్రాక్ పునరుద్ధరణ
- మూడు రోజుల కిందట కొట్టుకుపోయిన ట్రాక్
- విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ఢిల్లీకి రాకపోకలకు అంతరాయం
- రెండు రోజుల పాటు శ్రమించిన రైల్వే సిబ్బంది
- వెయ్యి మంది సిబ్బంది శ్రమతో పూర్తైన పునరుద్ధరణ పనులు
- నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోవడంతో.. రాత్రిలోగా ట్రయల్ రన్ చేస్తామంటున్న అధికారులు
- రేపటి నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలు
వరద బాధితులకు వైఎస్సార్‌సీపీ భారీ విరాళం
- వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
- కోటి రూపాయలను ప్రకటించిన పార్టీ అధినేత వైఎస్ జగన్
- నిన్న సింగ్‌నగర్‌లో పర్యటించి బాధితుల కష్టాలను స్వయంగా చూసిన జగన్
- కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ అధినేత
- అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన జగన్
- విరాళ ప్రకటన చేసి.. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలనేదానిపై నిర్ణయం తీసుకోవాలని నేతలకు సూచన
ఎస్సై నగేష్‌కు సీఎం రేవంత్ అభినందనలు
- మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం
- ఆకేరు వాగు పోటెత్తి.. మరిపెడ మండలంలోని సీతారాంనాయక్తండాను ముంచెత్తిన వరద
- సీరోల్ ఎస్సై నగేష్ సాహసం
- తన సిబ్బందితో వెళ్ళి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- ఓ వృద్ధురాలిని స్వయంగా జోలె కట్టుకుని ఎత్తుకెళ్లిన ఎస్సై నగేష్
- ఎస్సై చూపిన ప్రతిభ, ధైర్య సాహసాలకు అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జగన్ జనాల్లోకి రావడం బాబుకి నచ్చట్లేదు
- భారీ వర్షాలకు ప్రభుత్వం నష్ట నివారణ చేయడంలో పూర్తిగా విఫలం
- చంద్రబాబు బాబు వెస్ట్.. జగన్ బెస్ట్ అని వరద బాధితులు అంటుంటే.. బాబుకి కడుపు మండుతుంది..
- ఐఏఎస్,ఐపీఎస్ అధికారులే వరదలకు కారణమని చంద్రబాబు అనడం హాస్యాస్పదం..
- చంద్రబాబు నాయుడు వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు పచ్చ మీడియా అబద్ధాలు రాతలు రాస్తుంది...
- రాష్ట్రం లో వచ్చిన విపత్తును ఎదుర్కోవడం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మంత్రులు పూర్తిగా విఫలం...
- ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి..
- రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పుకునే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ..?
- ప్రజలు కష్టాల్లో వుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు పోయాడు..?
- ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చి.. బోట్లు కొట్టుకువస్తే దానిపై విచారణ అనడం ఏంటి..?
- జగన్ జనాల్లోకి వస్తే.. చంద్రబాబుకి నచ్చడం లేదు.. అందుకే బురద చళ్ళుతున్నారు..
- వరదల్లో చిక్కుకున్న చిన్నపిల్లలు, వృద్దులు,గర్భిణులు ఆకలితో అలమటిస్తుంటే వారికి ఆహారం కూడా అందించలేక పోతున్నారు ..
:::మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
కృష్ణా
- మంతెన గ్రామానికి వరద ముప్పు.
- బుడమేరు కాలవ పొంగటంతో వరద నీటి ఉద్రిక్తత
- జలదిగ్బంధంలో మంతెన గ్రామం
- నీట మునిగిన ఎస్సీ, బీసీ కాలనీలు
- ఇళ్లలోకి చేరిన వరద నీరు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన జేసీ గీతాంజలి శర్మ
- ప్రజలు ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశాం
- బుడమేరు ఉదృతంగా ప్రవహిస్తోంది
- సురక్ష ప్రాంతాలకు తరలించేందుకు పడవలను ఏర్పాటు చేస్తాం
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఇది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం: ఆర్కే రోజా
- విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది
- చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు
- వారి కష్టాలు వర్ణనాతీతం...వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది
- కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు
- రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు
- ఎంతమంది వరదల్లో కొట్టుకువెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి
- ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపల్యమే కారణం
- విజయవాడ మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం ఐదురోజులైన కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణం
- వరద సహాయ చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
- ప్రభుత్వం భారీ వర్షాలపైనా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన 10 మంది ప్రాణాలు పోయాయి
- జగనన్న ప్రభుత్వం లో ఉన్నప్పుడు వర్షాలు, వరదలు, తుఫాన్లు వస్తాయన్న సమాచారం ఉంటే.. ముందుగానే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లం
- పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, పాలు, మంచినీళ్లు అందించేవాళ్లం
- అంతేకాదు వరద, తుఫాన్ బాధితులకు వాళ్ల ఇళ్లకు కూడా ఆహారం, నిత్యవసరాలు పంపిణీ చేసేవాళ్లం
- జగనన్న నిరంతరం అధికారులతో సమీక్షలు జరిపి, ఆయన చుట్టూ అధికారులను తిప్పుకోకుండా ప్రజలకు ముందు సహాయ చర్యలు అందేలా చేసేవారు
- ఈరోజు విజయవాడ వరదల్లో అలాంటి సహాయం ఎవ్వరికైనా ఇంటికి వెళ్లి అందించారా..?
- అధికారులను కనీసం సీఎం కానీ, మంత్రులు కానీ ముందుగా సిద్ధం చేశారా..?
- ఈ మంత్రులు ఏం చేస్తున్నారు?
విజయవాడ సహాయక చర్యల్లో అపశ్రుతి
- నగరంలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అపశ్రుతి
- సహాయక చర్యల్లో నిమగ్నమైన లైన్‌మెన్ వజ్రాల కోటేశ్వరరావు
- వరద ఉధృతితో నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన కోటేశ్వరరావు
- బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్న విద్యుత్‌శాఖమంత్రి గొట్టిపాటి రవి
తెలుగు రాష్ట్రాలకు నందమూరి బాలకృష్ణ భూరి విరాళం
- ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం
- నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూరి విరాళం
- తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు(చెరో రూ.50 లక్షలు) కోటి రూపాయల ప్రకటన
- నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నా: బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ.. అతిత్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా: బాలకృష్ణ
విజయవాడ
వరద బాధితులకే కాదు.. వాళ్లకూ కష్టాలు
- హెలికాప్టర్ ద్వారా వాంబే కాలనీలో బురదలో పడేస్తున్న ఫుడ్ ప్యాకేట్స్..
- ఫుడ్ ప్యాకేట్స్ వాటర్ కోసం బురదలో పడి కొట్టుకొంటున్న స్థానికులు
- రెండు రోజుల నుండి ఆహారం నీరు లేకపోవడంతో హెలికాఫ్టర్ వద్ద కి పరుగులు తీస్తున్న ప్రజలు..
- పక్కనే అపార్ట్మెంట్స్ వున్నా బురదలో పడేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్న బాధితులు..
- బురదలో ఫుడ్ కోసం కుక్కలా కొట్టుకొనేటట్లు ప్రభుత్వం చేసిందని ఆవేదన.
- బురదలో ఫుడ్ పడడం తో సగం పైనే బురద మయం అవుతుంది అని వాపోతున్న మహిళలు
- వరద సహాయకచర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి తప్పని కష్టాలు
- వరద బాధితులను తరలించేందుకు బోట్లను రప్పించిన అధికారులు
- తిండీతిప్పల్లేకుండా ఆకలితో అలమటిస్తున్న బోట్లతో వచ్చిన మత్స్యకారులు
- ముస్తాబాద్ వద్ద వరద బాధితుల కోసం బోటు ఏర్పాటు చేసిన అధికారులు
- బోటుతో పాటు మచిలీపట్నం నుంచి వచ్చిన ముగ్గురు మత్స్యకారులు
- అధికారులు తీసుకొచ్చి తమను వదిలేశారంటున్న బోటుతో వచ్చిన మత్స్యకారులు
- ఒక్కరు కూడా తమను పట్టించుకోవడమ లేదంటూ ఆవేదన
- వరద బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని వాపోతున్న మత్స్యకారులు
విజయవాడ
- గూడవల్లి వద్ద బుడమేరు కాల్వకు గండి
- నేషనల్ హైవే 16 మీదకు చేరిన వరద నీరు
- నిడమానూరు నుంచి గూడవల్లి వరకు రహదారిపై వరద
- రామన్ భవన్- కాలేజీలోకి ప్రవేశించిన వరద
- విద్యార్థుల్ని ఇంటికి పంపించేసిన శ్రీ చైతన్య యాజమాన్యం
- జాతీయ రహదారిపై ఎక్కికక్కడ నిలిచిపోయిన వాహనాలు
ఖమ్మం
- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు ఫైర్
- వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదు: హరీష్‌రావు
- వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది: హరీష్‌రావు
- అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి: హరీష్‌రావు
- తెలంగాణకు ఎందుకు సాయం చేయరో నిలదీద్దాం: హరీష్‌రావు
విజయవాడ
- సింగ్‌నగర్‌లో వరద బాధితుల ఆకలికేకలు
- తిండి, నీరు అందక అల్లాడిపోతున్న బాధితులు
- పునరావాస కేంద్రాల జాడేదీ?
- కట్టుబట్టలతో మిగిలాం
- పాల ప్యాకెట్లు, ఆహార పొట్లాల కోసం పోరాటం చేస్తున్నాం
- వరద సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం
ఆక్రమణలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్
- హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తాం
- ఆక్రమణలకు పుల్‌స్టాప్ పెట్టాల్సిందే
- ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా హైడ్రా ముందుకు వెళ్తుంది
- చెరువులు, కుంటల కబ్జాలపై చర్యలు తప్పవు
- ఆక్రమణలను ఉపేక్షించేది లేదు
- కబ్జాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలేదు లేదు
విజయవాడ
- విజయవాడ మధురానగర్ వద్ద కట్టకు గండి
- ఏలేరు, బుడమేరు కాల్వలు కలిసేచోట కట్టకు గండి
- రైలు వంతెన వద్దకు భారీగా చేరుతున్న వరద
- ఏలేరు కాల్వలో కలుస్తున్న వరద ప్రవాహం
- గండి కారణంగా రైల్వే వంతెన వద్ద ప్రమాదకర పరిస్థితి
లగేజీలో డబ్బు కొట్టేశారు: టోల్‌గేట్ వద్ద వాహనదారుల ఆరోపణ
- ఎన్టీఆర్ నందిగామ ఐతవరం వద్ద వరద ప్రాంతం లో అస్తవ్యస్తం గా పరిస్థితి
- వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలను తీసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటున్న వాహనదారులు
- మట్టిలో కూరుకుపోయిన పదుల సంఖ్యలో లో ద్విచక్ర వాహనాలు
- నిర్లక్ష్యానికి వ్యవహరిస్తున్న కీసర టోల్ ప్లాజా యాజమాన్యం
- వరదనీటి లో కొట్టుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు ముందుకు రాని టోల్ గేట్ యాజమాన్యం
- ప్రైవేట్ వ్యక్తులు చేత ఒక్కో 10 కారుకు నుండి 15వేల రూపాయలు ఇచ్చి బయటకు తెచ్చుకుంటున్న వాహన యజమానులు
- రోడ్డు కోతకు గురైన చోట సహాయక చర్యలు చేపట్టకుండానే టోల్ వసూలు చేస్తున్న కీసర టోల్గేట్ యాజమాన్యం
- జాతీయ రహదారిపై 100 నుండి కిలోమీటర్ మేర కొట్టుకుపోయిన వాహనాలు
- తమ వాహనాల్లో ఉన్న లగేజ్, డబ్బు, బంగారు దొంగిలించారంటున్న బాధితులు
బాబుకు చేత కాకపోతే నాకు చెప్పాల్సింది: కేఏ పాల్
- విజయవాడ వరదలు.. ఏపీ సీఎంపై కేఏ పాల్ ఫైర్
- చంద్ర బాబు నాయుడు కి చేతకాక పోతే నేను వీళ్ళకి సహాయం చేసేవాడిని
- ముందుగా తెలిసిన ఎటువంటి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు
- అమెరికాలో అయితే బలవంతంగా ఖాళీ చేయిస్తారు
- కానీ, విజయవాడలో ఇక్కడ ఇప్పటికీ చేయించలేక పోయారు
అప్రమత్తంగా ఉన్నా నష్టం తప్పలేదు: సీఎం రేవంత్
- ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నా.. అపార నష్టం వాటిలల్లిఇంది
- ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు దెబ్బ తిన్నాయి
- బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ల కష్టనష్టాల గురించి తెలుసుకున్నాం
- మరిపెడ మండలంలోని మూడు తండాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం
- ఒక కాలనీలా ఏర్పాటు చేసి తండా వాసుల్ని అక్కడికి తరలించాం
- పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు.. మేకలు చనిపోతే రూ.5 వేలు అందిస్తాం
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తాం
- వరద సహాయక చర్యలపై కలెక్టర్లు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం
- ఇలాంటి విపత్తులపై కలెక్టరేట్‌లో బ్లూబుక్ రూపొందించాలి
- మెడికల్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి
- ప్రభుత్వ యంత్రాంగం అంతా సమన్వయం చేసుకోవాలి
- అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులు, అధికారులు పని చేయాలి
- బురద కడగడానికి వీలైనన్ని ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలి
- ఈ వరదలను కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలి
- వీలైనంత తక్కువ నష్టంతో బయటపడే ప్రయత్నం చేస్తున్నాం
- పంట నష్టాన్ని అంచనా వేసి.. ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తాం
మహబూబాబాద్ కలెక్టరేట్‌లో సీఎం రేవంత్ ప్రకటన
ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
- ఏపీకి మరో మూడు రోజులపాటు వర్షాలు
- పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
- ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- కాకినాడ, తూ.గో, కోనసీమ, గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణల సీఎం రిలీఫ్ ఫండ్‌కు నటుడు సిద్ధు జొన్నలగడ్డ రూ. 30లక్షల విరాళం
- ఏపీకి వరద సహాయనిధికి రూ. 15 లక్షలు
- తెలంగాణా వరద సహాయనిధికి 15 లక్షలు విరాళం ప్రకటించిన సిద్దు జొన్నలగడ్డ
ఖమ్మం
అధైర్య పడకండి.. ఇందిరమ్మ ప్రభుత్వం మీకు అండగా ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ముదిగొండ లో ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- మీ కష్టాలను కన్నీళ్లను తుడవడానికి మీ దగ్గరికి వచ్చాను
- వరద ముంపు బాధితులకు భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ముంపు ప్రాంత నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం
- పంట నష్టం అంచనాలు తయారు చేయించి పరిహారం ఇస్తామని అన్నదాతలకు హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం
ఎన్టీఆర్ జిల్లా
వత్సవాయి మండలం లింగాల వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జి.
- చిలకల్లు వైరా రహదారిని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.
- జగ్గయ్యపేట మండలం కె. అగ్రహారం లో పాలేరు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం లో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు.
- జగ్గయ్యపేట నుండి ముక్త్యాల, తెలంగాణలోని దొండపాడు, సిమెంట్ కర్మాగారాలకు నిలిచిపోయిన రాకపోకలు.
- నియోజకవర్గంలో పలు గ్రామాలలో వరద ఉధృతికి చెరువులు తెగి కొట్టుకుపోయిన రహదారులు.
విజయవాడ :
- పక్కదారి పడుతున్న ఆహార సరఫరా
- వరద బాధితులకు అందని ఆహారం, నీళ్లు
- పడవల్లో పంపుతున్నది అరకొరే
- వరద లేని ప్రాంతాల్లో ఆహార పొట్లాలు అందిస్తున్న ప్రభుత్వం
- రోడ్డున పోయే వారికే వాటర్ బాటిల్స్, ఆహారం పంపిణీ
- ప్రభుత్వ పనితీరు చూసి విస్తుపోతున్న జనం
- రికార్డుల్లో లెక్కలు, మీడియాలో ప్రచారం కోసం ప్రభుత్వం తపన
- ఇప్పటికే నాలుగు రోజులుగా ఇంట్లో నుండి బయటకు రాలేక అవస్థలు పడుతున్న మూడు లక్షల మంది
విజయవాడ :
- ముంపు కాలనీలో అరకొరగా ప్రభుత్వ సహాయక చర్యలు
- పాతరాజరాజేశ్వరి పేటలో వరద బాధితులకు తప్పని కష్టాలు
- తమను పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన
- దిగువ ఉన్న కాలనీల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం
- స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ చుట్టుపక్కల వారికి సహాయం అందిస్తున్న యువకులు
- ప్రభుత్వ సాయం అందకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్న వరద బాధితులు
అస్నా తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరికలు
- అరేబియా మహాసముద్రంలో బలపడుతున్న అస్నా తుఫాన్
- రాగల 24గంటల్లో అస్నా తుఫాన్ ప్రభావం
- గుజరాత్ రాజస్థాన్, మధ్యప్రదేశ్,మహారాష్ట్ర.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం
మహబూబాబాద్ జిల్లా :
- సైంటిస్ట్ అశ్వనీ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో వరద
- దాటికి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండా వాసులు
- వరద ధాటికి కొట్టుకుపోయిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్
- అశ్వినీ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
విజయవాడ సింగ్ నగర్‌లో ప్రైవేట్ దందా
- బోటు ఎక్కాలి అంటే రూ.20 వేలు డిమాండ్
- బోట్ల దందాపై వరద బాధితుల ఆగ్రహం
- బాధలలో ఉన్న మేము ఎలా వేల రూపాయలు కడతామని బాధితుల ఆవేదన
- సీఎం చంద్రబాబుపై ప్రజల ఆగ్రహం
విజయవాడ: సింగ్ నగర్‌లో మంటగలిసిన మానవత్వం
- విజయవాడ సింగ్ నగర్‌లో మానవత్వం మంటగలిసింది
- వ్యాపారస్థులు,హోటల్ నిర్వహకుల చేతివాటం
- ప్రభుత్వ పంపిణీ చేస్తున్న ఆహారాన్ని సేకరించి బ్లాకులో అమ్ముతున్న సేకరణ
- సేకరించిన ఆహారపదార్ధరాల్ని శివారు ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
- మూడు రోజులుగా పంపిణీ చేస్తున్న ఆహారం అందలేదని ప్రజల ఆగ్రహం
అమవాస్య గండం నుంచి గట్టెక్కుతున్న బెజవాడ
- ప్రకాశం బ్యారేజీ దగ్గర తగ్గుతున్న వరద ఉధృతి
- 18గంటల్లో తగ్గిన లక్ష క్యూసెక్కుల వరద
- వేగంగా సముద్రంలో చేరుతున్న వరద నీరు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం
- వదరబాధితులకు ఒకరోజు జీతం ఇచ్చేందుకు నిర్ణయం
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం విరాళం రూ.100కోట్లు
జల దిగ్బంధంలోనే విజయవాడ
- విజయవాడ నగరంలో మూడోరోజు అదే పరిస్థితి
- ఎటు చూసినా వరద, జనజీవనం అస్తవ్యస్త్యం
- మూడు రోజులుగా వరదలో చిక్కుకుని విలవిల
- ముంపులోనే పలు కాలనీలు, 7-8 అడుగుల మేర నీళ్లు
- చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయం
విజయవాడలో మళ్ళీ కొండ చరియల భయం
- రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో భయం భయంగా కొండ ప్రాంత ప్రజలు
- ఐదు రోజుల క్రితమే క్రీస్తురాజుపురంలో కొండ చరియలు విరిగి పడి ఆరుగురు మృతి
- కొండల చుట్టూ చిట్టినగర్, క్రీస్తురాజుపురం, గుణదల, మొగల్యాజుపురం సున్నబట్టీసెంటర్ తదితర ప్రాంతాలు
- కొండల మీద, వాలు ప్రాంతాల్లో సుమారు 2 లక్షల మంది నివాసం
- రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు
- వర్షం పడితే మా పరిస్థితి ఏంటంటున్న కొండవాలు కాలనీల ప్రజలు
విజయవాడ :
- ప్రచార పిచ్చిలో సీఎం చంద్రబాబు
- తెల్లవారుజాము నుండి బందర్ రోడ్డులో భారీగా నిలిచిన ట్రాక్టర్లు
- వరద బాధితులను తరలించేందుకు ఇతర జిల్లాల నుండి రప్పించిన ట్రాక్టర్లు
- ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపాక ట్రాక్టర్లను పంపాలని అధికారుల నిర్ణయం
- గత నాలుగు రోజులుగా వరద ముంపులోనే ఉన్న 4 లక్షలకు పైగా బాధితులు
- ఐనాసరే చంద్రబాబు ప్రచారం కోసం ట్రాక్టర్లను నిలిపేసిన అధికారులు
- నిన్నంతా ఎన్డీఆర్ఎఫ్ బోట్లు చంద్రబాబు, మంత్రుల పర్యటనలకే పరిమితం
- లక్షల మంది వరద బాధితుల హాహాకారాలను పట్టించుకోని సీఎం చంద్రబాబు
- ఇవ్వాళ ట్రాక్టర్లను తెప్పించినా సీఎం జెండా ఊపే వరకు కదలవు అంటున్న అధికారులు
విజయవాడ :
- మూడు రోజుల నుంచీ వరద నీటిలో చిక్కుకుపోయిన.. వృద్ధులకు నేడు విముక్తి
- వాటర్ బాటిల్ రూ.200 అమ్ముతున్నారు అని బాధితులు ఆవేదన
- తినడానికి తిండి కూడా దొరకడం లేదు అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు
విజయవాడ :
- పోలీసుల ఓవరాక్షన్
- వరద కవరేజీకి వెళ్లిన జర్నలిస్టుపై దురుసు ప్రవర్తన
- ప్రభుత్వం సహాయం చేయకపోయినా ఎవరికి వాళ్ళు వాటర్ ప్యాకేట్స్ తీసుకొని వెళ్తున్న ప్రజలు
- వార్తలు కవర్ చేయకుండా అడ్డుకున్న పోలీసులు
- ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుదని మీడియా గొంతు నొక్కి ప్రయత్నం
- వీడియోస్ తీయవొద్దంటూ పక్కకి వెళ్లమంటూ మీడియా ప్రతినిధి తోసేసిన పోలీసులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…— Jr NTR (@tarak9999) September 3, 2024
జూనియర్ ఎన్టీఆర్ వరద సాయం
- వరద బీభత్సంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది
- ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థించిన ఎన్టీఆర్
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.కోటి విరాళం
సికింద్రబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు పడిగాపులు :
- రైళ్లు రద్దు కావడంతో సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు పడిగాపులు
- నిన్నటి వరకు 432 రైళ్లు రద్దు
- మరికొన్ని దారి మళ్లింపు
- నార్త్ స్టేట్స్ కు వెళ్ళే ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
- కేసముద్రం ఇంటికన్నె వద్ద కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు
- పనులు పూర్తి కాకపోవడం తో ఇంకా సాగని రైళ్ళ రాకపోకలు
- మరి ఒకటి రెండు రోజుల పాటు రైళ్ళ రద్దు కొనసాగే అవకాశం
- బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల కష్టాలు
మహబూబాబాద్ జిల్లా :
- నేడు మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు నలుగురు మంత్రుల పర్యటన
- డోర్నకల్ ఎన్‌టీఆర్ సర్కిల్, పురుషోత్తంగూడెం బ్రిడ్జిలను పరిశీలించనున్న నేతలు
మరో 15రైళ్లు రద్దు :
- మరో 15 రైళ్లు రద్దు
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 15 రైళ్లను రద్దు చేశారు
- ఇప్పటికే 496 రైళ్లను తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా రద్దు చేసింది
- ఇప్పుడు తాజాగా 15 రైళ్లను రద్దు చేశారు
- మరో 10 రైళ్లను దారి మళ్లించారు
- ఇప్పటివరకు 163 రైళ్ళను పైగా దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే
నల్గొండ జిల్లా :
- నల్లమల అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి చిక్కుకున్న డిండి మండలం దెయ్యం గుండ్లకు చెందిన 10 మందిని కాపాడిన నల్గొండ జిల్లా పోలీసులు
- నిన్న సాయంత్రం 6 గంటలకు సమాచారం అందినే వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగంరాత్రి
- నుంచి డ్రోన్ కెమెరా ద్వారా గాలింపు చర్యలు చేపట్టి రిస్క్యూ చేసి బాధితుల గుర్తింపు బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం పదార్థాలు అందజేసి భరోసా
- రాత్రి సమయంలో ఎక్కువ వరద ఉధృతి ఉండటం వలన ఈరోజు ఉదయం బాధితులను తాడు ద్వారా రక్షించింన నాగర్ కర్నూల్ పోలీసులు
నాగర్ కర్నూల్
- నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర శివారులో నీట మునిగిన పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్.
- వట్టెం నుండి వరద నీరు టన్నెల్ నుంచి సర్జిపుల్, పంప్ హౌస్ కు చేరిన వరద.
- నీటిని తోడుతున్న అధికారులు.
- నీటిని తోడుతేనే నష్టం ఎంతో తెలుస్తుందంటున్న అధికారులు.
విజయవాడ
- బుడమేరు వరదలో తండ్రి కొడుకు గల్లంతు
- పొలానికి వెళ్లి బుడమేరు వాగులో చిక్కుకున్న తండ్రి కొల్లిపర వెంకటేశ్వరరావు , కొడుకు సందీప్
- తండ్రి కొడుకులు ఇద్దరు మృతి
- మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలింపు
- కన్నీరు మున్నేరుగా వినిపిస్తున్న కుటుంబ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment