కర్నూలు వైఎస్సార్‌సీపీ ఆఫీసు కూల్చివేత ఉత్తర్వులు రద్దు: హైకోర్టు | Cancellation of demolition order of YSRCP office | Sakshi
Sakshi News home page

కర్నూలు వైఎస్సార్‌సీపీ ఆఫీసు కూల్చివేత ఉత్తర్వులు రద్దు: హైకోర్టు

Published Fri, Aug 23 2024 5:17 AM | Last Updated on Fri, Aug 23 2024 5:17 AM

Cancellation of demolition order of YSRCP office

సాక్షి, అమరావతి: కర్నూలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవనం కూల్చివేతకు కర్నూలు ముని­సిపల్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ భవనం నిర్మాణానికి సంబంధించిన వివ­రాలు, ఆ పార్టీ వర్గాలు సమర్పించే అద­నపు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, విచా­రణ జరిపిన తరువాతే చట్ట ప్రకారం 8 వారాల్లో తగిన నిర్ణయం తీసు­కోవాలని, అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని ఆదే­శించింది. 

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురు­వారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యాలయం భవనం కూల్చి­వేతకు మునిసి­పల్‌ కమిషనర్‌ ఈ నెల 7న జారీ చేసిన కన్ఫర్మేషన్‌ ఆర్డర్‌ను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పి­రెడ్డి, కర్నూలు జిల్లా కమిటీ అధ్యక్షురాలు సత్య­నారాయణమ్మ హైకోర్టు­లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ కృష్ణ­మోహన్‌ గురు­వా­రం విచా­రణ జరిపారు. 

పిటిషనర్ల తరఫు న్యాయ­వాది వివేకానంద విరూ­పాక్ష వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర­వ్యాప్తంగా వైఎ­స్సా­ర్‌సీపీ కార్యా­లయ భవ­నాల విషయంలో గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముని­సిపల్‌ అధికారుల నోటీసుకు సమగ్ర వివరాలతో వివరణ ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ దానిని పరిగణనలోకి తీసు­కోకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా భవ­నం కూల్చివేతకు కన్ఫర్మేషన్‌ ఆర్డర్‌ జారీ చేశా­రని తెలి­పారు. 

అధికారులు లేవనెత్తిన ప్రతి అభ్యంత­రా­­నికీ సమాధానం ఇచ్చామని, ఒక్క దాన్ని కూడా కనీస స్థాయిలో పరిగణనలోకి తీసు­కోలే­దని, సహ­జ న్యాయ సూత్రాలను అనుసరించలేదని అన్నా­రు. వాదనలు విన్న న్యాయమూర్తి, మునిసి­పల్‌ కమిష­నర్‌ జారీ చేసిన కన్ఫర్మేషన్‌ ఆర్డర్‌ను రద్దు చేశారు. 2 వారాల్లో అన్ని డాక్యుమెంట్లు సమ­ర్పించాలని పిటిషనర్లను ఆదేశించారు. వాటిని క్షు­ణ్ణ­ంగా పరిశీ­లించి తగిన నిర్ణయం తీసుకో­వాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశిస్తూ పిటిషన్‌ను పరి­ష్క­రించా­రు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement