నేడు విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ | CM YS Jagan visit to Visakhapatnam on 17th feb | Sakshi
Sakshi News home page

నేడు విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్

Published Wed, Feb 17 2021 3:27 AM | Last Updated on Wed, Feb 17 2021 8:45 AM

CM YS Jagan visit to Visakhapatnam on 17th feb - Sakshi

సాక్షి, అమరావతి/పెందుర్తి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  బుధవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళతారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 11.10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రతినిధి బృందం సీఎం వైఎస్‌ జగన్‌ను కలవనుంది. ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని వినతి పత్రం సమర్పించనుంది.11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య పెందుర్తి మండలం చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవం తొలి రోజు కార్యక్రమంలో పాల్గొంటారు.

పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. బుధవారం ఉదయం 7:30 గంటలకు స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలు ప్రారంభించి, పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేశ రక్షణ, లోక కల్యాణార్థం రాజశ్యామల యాగం ప్రారంభిస్తారు. సీఎం జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని.. స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణ చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. ఇదిలా ఉండగా ఉదయం ఎయిర్‌పోర్టులో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రతినిధి బృందం సీఎం జగన్‌ను కలవనుంది. ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని వినతి పత్రం సమర్పించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement