డొక్కు రాతలే దిక్కా రామోజీ..?!  | FactCheck: Eenadu News Paper Spread False News On APSRTC, Facts Inside - Sakshi
Sakshi News home page

FactCheck: డొక్కు రాతలే దిక్కా రామోజీ..?! 

Published Thu, Nov 9 2023 4:48 AM | Last Updated on Thu, Nov 9 2023 10:28 AM

Eenadu news paper spread false news on apsrtc - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్న రామోజీరావు.. ప్రగతి రథచక్రంలా పరుగెడుతున్న ఆర్టీసీపై పనిగట్టుకుని విషం చిమ్మారు. అవాస్తవాలన్నీ పోగేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ‘డొక్కు బస్సులే దిక్కా’  అంటూ ఈనాడులో ఓ కథనాన్ని అచ్చేశారు. వాస్తవాలన్నీ  ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగులకు తెలుసు. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందుకుంటున్న వారి కుటుంబాలకు తెలుసు. కొత్త బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయా­ణికులకు తెలుసు. తొలిసారిగా విద్యుత్‌ బస్సుల్లో వెళుతున్న తిరుమల–తిరుపతి భక్తులకు తెలుసు.

ఎవరేమనుకుంటే నాకేంటి.. నా ‘పచ్చ’పార్టీకి ఇష్టంగా రాయడమే నాకు తెలుసు అన్నట్లు రామోజీరావు తన వక్రబుద్ధిని ఆ కథనంలో బయటపెట్టుకున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ప్రగతిపథంలో పరుగెడుతోంది అని చెప్పడానికి నాలుగేళ్లలో పెరిగిన సంస్థ రాబడే నిదర్శనం. ఆర్టీసీలో ప్రయా­ణం సురక్షితం అనడానికి టీడీపీ ప్రభుత్వ హయాం కంటే గణనీయంగా తగ్గిన బస్సు ప్రమాదాలే తార్కాణం. అందువల్లే ఆర్టీసీవి కొత్త బస్సులు.. రామోజీవి డొక్కు రాతలు అని అటు ప్రయాణికులు, ఇటు సిబ్బంది ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోరుకు వచ్చింది ఈనాడు పత్రికే అని గుర్తించాలని రామోజీకి హితబోధ చేస్తున్నారు.
 
కొత్త బస్సులు కనబడటంలేదా? 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు వేగవంతం చేసింది. 2019–20లో 406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. కోవిడ్‌ మొదటి, రెండు వేవ్‌ల తరువాత ఆర్టీసీలో ఉన్న 2,584 బస్సులను రూ. 50 కోట్లు వెచ్చించి ఆధునీకరించింది. ఇక పాత బస్సుల స్థానంలో కొత్తగా 900 డీజిల్‌ బస్సులను అద్దె విధానంలో ప్రవేశపెట్టింది.

రాష్ట్రంలో తొలిసారిగా 100 ఈ–బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్డులో ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది. తాజాగా 1,500 కొత్త డీజీల్‌ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. పారదర్శకంగా కొనుగోలు కోసం టెండర్ల ప్రక్రియను జ్యుడిíÙయల్‌ ప్రివ్యూకు పంపింది. కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాటిని ఎప్పటికప్పుడు ఆర్టీసీ తొలగిస్తోంది. ఈ నాలుగేళ్లలో 214 బస్సులను తుక్కుగా మార్చింది. ఈ ఆరి్థక సంవత్సరంలో మరో 52 బస్సులను తుక్కుగా మార్చనుంది.  

మౌలిక వసతులు అభివృద్ధి 
రాష్ట్రంలో ఆర్టీసీ మౌలిక వసతులను నాలుగేళ్లలో ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసింది. బస్‌స్టేషన్ల పునరుద్ధరణ, నిర్మాణం కోసం రూ. 110 కోట్లు వెచ్చించింది. రాజాం, విజయనగరం, నరసాపురం, హనుమాన్‌ జంక్షన్, గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, జగ్గయ్యపేట, దోర్నాల, సింగరాయకొండ, కడప, కోయిలకుంట్ల, వేంపల్లి, ప్రొద్దుటూరు, రాయచోటి, బేతంచర్ల, డోన్, ఆత్మకూరులలో బస్‌స్టేషన్లు నిర్మించింది. రాజమహేంద్రవరం, అనంతపురం, తిరుపతి, నరసరావుపేటలలో మెడికల్‌ డిస్పెన్సరీలను విస్తరించి ఆధునీకరించింది. రూ. 34 కోట్లతో పులివెందులలో బస్‌స్టేషన్, బస్‌డిపో నిర్మించింది.
 
ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ 
ఆర్టీసీ బస్సు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. డ్రైవర్లకు పూర్తిస్థా­యిలో ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. డ్రైవర్లతో సహా ఆర్టీసీ ఉద్యోగులకు తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. రోజువారీ విధుల్లో చేరే ముందు డ్రైవర్లకు తప్పనిసరిగా బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు చేస్తోంది. 2018 తరువాత బస్సు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బస్సు ప్రమాదాలు బాగా తగ్గాయి.  
సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం.. 
ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రతినెల రూ. 275 కోట్లు వెచ్చిస్తోంది. జనవరి, 2020 నుంచి ఇప్పటివరకు రూ. 11,711 కోట్లు జీతాల కోసం చెల్లించింది. తీవ్రమైన కోవిడ్‌ పరిస్థితుల్లోనూ ప్రతి నెల ఒకటో తేదీనే ఆర్టీసీకి జీతాలు చెల్లించడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ చర్యలతో సంస్థపై ఆర్థికభారం తగ్గడంతో దీర్ఘకాలంగా ఉన్న బకాయిలను చెల్లిస్తోంది. ఇప్పటికే బ్యాంకు రుణాలు రూ. 1,121 కోట్లు, పీఎఫ్‌ బకాయిలు రూ. 996 కోట్లు, సీసీఎస్‌బకాయిలు రూ. 269 కోట్లు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 374 కోట్లు కలిపి మొత్తం రూ. 2,760 కోట్ల బకాయిలను చెల్లించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సర్వీసులో ఉంటూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 693 మందికి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులతోసమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పీఆర్సీ–2022ను అమలు చేసింది.

ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా కోసం ఎస్‌బీఐతో కార్పొరేట్‌ సాలరీ ప్యాకేజీ కింద ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగులకు క్యాష్‌లెస్‌ హెల్త్‌స్కీమ్‌ను సమర్థంగా అమలు చేస్తోంది. హయ్యర్‌ పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేసింది. ప్రభుత్వంలో విలీనం చేసిన నాటికి ఉన్న ఉద్యోగులకు ఆర్టీసీ నిబంధనల మేరకే పదోన్నతలు కల్పించాలని నిర్ణయించింది.  

ప్రమాద బాధ్యులపై చర్యలు 
విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌లో ము­గ్గురి మృత్యువాతకు కారణమైన ప్రమాద ఘటనపై ఆర్టీసీ తీవ్రంగా స్పందించింది. విచారణ నిర్వహించి ప్రమాదానికి బాధ్యులుగా నిర్ధారించిన డ్రైవర్, ట్రాఫిక్‌ సూపర్‌ వైజర్‌లను సస్పెండ్‌ చేసింది.   

పెరుగుతున్న ఆదరణ.. ఆదాయం.. 
ఆర్టీసీ చేపడుతున్న చర్యల ఫలితంగా ఆర్టీసీ బస్సులపట్ల ప్రజలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. నాలుగేళ్లుగా పెరుగుతున్న ఆర్టీసీ రాబడే అందుకు నిదర్శనం.  
2019–20లో ఆర్టీసీకి రూ. 4,781 కోట్ల రాబడి రాగా 2022–23కు అది రూ. 5,574 కోట్లకు పెరిగింది. 
2019–20లో కి.మీటర్‌కు రూ. 31.31 చొప్పున రాబడి రాగా 2022–23లో కి.మీటర్‌కు రూ. 37.91కు పెరిగింది.  
ఇక కార్గో సేవల ద్వారా 2018–19లో రూ. 101 కోట్లు రాబడి రాగా 2022–23లో రూ. 169 కోట్లు వచ్చింది.  
వాణిజ్య ఆదాయం 2018–19లో రూ. 227 కోట్లు రాగా 2022–23లో రూ. 300 కోట్లకు పెరిగింది.   

సక్రమంగా నిర్వహణ.. నిధులు మంజూరు 
ఆర్టీసీ బస్సులకు స్పేర్‌పార్ట్‌ల కొనుగోలు, ఇతర నిర్వహణ వ్యయం కోసం నిధుల్లో కోత విధించారన్న ఈనాడు రాతలు పూర్తి అవాస్తవం. నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో స్పేర్‌ పార్ట్‌లు, నిర్వహణ కోసం స్టోర్స్‌ విభాగానికి ఆర్టీసీ 
పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది.

2020–21, 2021–22లో కోవిడ్‌ మొదటి, రెండో వేవ్‌లలో ఆర్టీసీ బస్సు సర్విసులు బాగా కుదించింది. దాంతో స్పేర్‌ పార్టుల కోసం బడ్జెట్‌ ప్రతిపాదనలు తగ్గాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement