![Krishna And Godavari Board Meeting On September 13th - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/13/Krishna-And-Godavari.jpg.webp?itok=oNIzAQgR)
ఢిల్లీ: నేడు ఢిల్లీలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రెండు బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ భేటీ కానున్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణపై అమలుపై చర్చ జరపనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు పలు సవరణలు సూచిస్తూ రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై కేంద్రం దృష్టి సారించింది. (చదవండి: చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్)
గెజిట్ నోటిఫికేషన్ అమలు, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో నేడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment