‘ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా’ | Minister Kodali Nani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు

Published Tue, Mar 30 2021 5:24 PM | Last Updated on Tue, Mar 30 2021 6:09 PM

Minister Kodali Nani Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్‌ పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ  పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో​ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను, ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారని మండిపడ్డారు. ‘‘నిన్న జరిగింది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా’’ అని ఎద్దేవా చేశారు.

‘‘ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ అంటే.. చంద్రబాబు బూతులు తిడుతున్నారు. ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు తన హయాంలో సింగపూర్‌కి అప్పులిచ్చాడా?. చంద్రబాబు రూ.3లక్షల 60 వేల కోట్లు అప్పులు తెచ్చి దుబారా చేశారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు సీఎం జగన్‌ అప్పులు తెచ్చారు. చంద్రబాబు బతుకంతా వ్యవస్థలను మేనేజ్‌ చేయడం.. స్టేలు తెచ్చుకోవడమే.. ప్రజాబలంతో సీఎం అయిన నాయకుడు వైఎస్‌ జగన్‌. తిరుపతిలో 5 లక్షలకుపైగా మెజార్టీతో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని’’ కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.


చదవండి:
‘ఢిల్లీ వరకు ఆ రీసౌండ్‌ వినిపించాలి’
కోవిడ్‌ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement