ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్తీక్ అనే రామ భక్తుడి ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకునేందుకు వచ్చారు. రామయ్య దర్శనార్థం ఆలయ ప్రధాన గోపురం వద్ద నుంచి లోనికి వెళ్తుండగా కార్తీక్ చేతిలో నుంచి బంగారు వస్తువు అయిన బ్రాస్లెట్ కనిపించకుండా పోయింది. దీంతో బాధితులు కంగారుపడి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి క్షేత్రానికి రాక ముందు దేవుని కడప శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాడు. దీంతో తిరిగి దేవుని కడప వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని అక్కడ సిసి కెమెరాలను పరిశీలించారు. అక్కడ నుంచి ఒంటిమిట్టకు వచ్చేటప్పుడు కారు ఎక్కుతుండగా తన చేతికి బ్రాస్లెట్ ఉండటం గమనించారు. దీంతో బ్రాస్లెట్ ఒంటిమిట్టలోనే పోయి ఉంటుందని తిరిగి ఇక్కడికి రాగా ఒంటిమిట్ట విజిలెన్సు అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆలయ విజిలెన్సు సిబ్బందికి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లారు. ఒంటిమిట్టి వద్ద బిక్షాటన చేస్తున్న కొంతమంది చేతికి బ్రాస్‌లైట్ దొరికింది. దానిని పెద్దకొత్తపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తికి అమ్మేశారని తెలిసింది. విజిలెన్సు అధికారులు, ఒంటిమిట్ట ఎస్‌ఐ శివప్రసాద్ విచారించి బ్రాస్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడికి ఫోన్ ద్వారా తెలపడంతో వారు వచ్చి బ్రాస్లెట్ తీసుకున్నట్లు విజిలెన్సు అధికారి గంగులయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment